టాలీవుడ్ లో ‘శివ మనసులో శృతి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రెజీనా కాసాండ్రా. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయిన.. ఆ తర్వాత వచ్చిన ‘రోటీన్ లవ్ స్టోరీ’ సినిమాతో మంచి హిట్ కొట్టి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో పిల్లా నువ్వే లేని జీవితం, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాంటీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూనే.. అటూ తమిళ, కన్నడ సినిమాల్లో కూడా ప్రవేశించింది రెజీనా. తాజాగా ఈ భామ తెలుగులో నటించిన ‘ఎవరు’ ఆ మధ్య విడుదలై.. హిట్ టాక్‌ను తెచ్చుకుంది. తాజా రెజీనా కౌగిలింత, ముద్దులన్న విపరీతంగా భయపడుతుంది. కరోనా వైరస్ కారణంగా క్లోజప్ సన్నివేశాల్లో నటించాలంటేనే అంతా భయపడుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ- ‘కౌగిలింత లేదా లిప్ లాక్స్ వంటి సన్నిహిత సన్నివేశాల్లో నటించడానికి భయ పడుతున్నానని .. ప్రాణాంతక వైరస్ సంభవిస్తుందనే భయం గా ఉంది” అని చెప్పింది.