Bigg Boss 8 Telugu Elimination:
బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ ఆసక్తికరమైన మలుపు తీసుకుంది. షోలో 12 మంది కొత్త సెలబ్రిటీ కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా హౌస్‌లోకి ప్రవేశిస్తారని ప్రకటించారు. ఈ ఎంట్రీలతో బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుత కంటెస్టెంట్ల ఆటతీరు పూర్తిగా మారిపోబోతోంది. కొత్త కంటెస్టెంట్లను అడ్డుకోవడానికి ప్రస్తుత కంటెస్టెంట్లు ఫిటెస్ట్ ఆఫ్ ది సర్వైవల్ అనే చాలెంజ్ లను ఎదుర్కొన్నారు. ఈ టాస్క్ చాలా ఆసక్తిగా సాగి, 12 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లలో ముగ్గురిని విజయవంతంగా హౌస్‌లో ప్రవేశించకుండా అడ్డుకోగలిగారు.
ఈ చాలెంజ్ లో నిఖిల్ క్లాన్ రెండు విజయాలను సాధించగా, సీత క్లాన్ ఒక విజయం అందుకున్నారు. ఐదు సవాళ్ల అనంతరం.. 9 మంది కొత్త కంటెస్టెంట్లు త్వరలో బిగ్ బాస్ హౌస్‌లోకి రాబోతున్నారని బిగ్ బాస్ సంకేతాలు ఇచ్చారు. వీరి ప్రవేశంతో హౌస్‌లో ఆటతీరు మరింత ఆసక్తికరంగా మారనుంది.
ఇక నాలుగవ వారం ఎలిమినేషన్స్ దగ్గరపడుతున్న సమయంలో, డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని పుకార్లు వస్తున్నాయి. ఇది బిగ్ బాస్ టీం రాబోయే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు స్థానం కల్పించేందుకు తీసుకుంటున్న వ్యూహం కావచ్చు. కొందరు వర్గాలు చెబుతున్న దాని ప్రకారం, మూడు నుండి నాలుగు మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్స్‌లో, నబీల్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా, ప్రేరణ రెండవ స్థానానికి చేరుకుంది. నాగ మణికంఠ ప్రస్తుతం మూడవ స్థానంలో ఉన్నాడు. ఆశ్చర్యకరంగా, ఆదిత్య ఓం నాలుగవ స్థానంలో ఉన్నాడు. పృథ్వి, సోనియా, ఆదిత్య ఓం లు డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరిలో సోనియా ఎలిమినేట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది.
Read More: Bigg Boss 8 Telugu నబీల్ అఫ్రిది రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే