Game Changer Target Collections:
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ సినిమా గేమ్ ఛేంజర్. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. ఇప్పటికే టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
ఈ సినిమాను దిల్ రాజు దాదాపు ₹400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నిర్మాణ, ప్రమోషన్ ఖర్చులు కలిపి మొత్తం ₹500 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఐదేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలోగా చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
గేమ్ ఛేంజర్ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్టు సమాచారం. డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపి ₹200 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ ₹120 కోట్లు, ఇతర భాషలు మరియు ఓవర్సీస్ కలిపి ₹180 కోట్లు బిజినెస్ అయినట్టు టాక్. మొత్తం బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ సినిమా ₹300 కోట్ల వరకు రాబట్టాలి.
రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ లెవల్‌లో స్టార్ హీరోగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ టార్గెట్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. కానీ నెగిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ టార్గెట్ రీచ్ కావడం కష్టమే.
తారక్ దేవర సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేసినట్లే, ఇప్పుడు చరణ్ గేమ్ ఛేంజర్ తో అలాంటి టాక్‌ను దూరం చేస్తాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం ఖాయం.
ALSO READ: Hyderabad లో రికార్డు స్థాయిలో దొరికిన డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు!