Pushpa 2 target at Hindi Box Office:
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా మరో 20 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ అత్యంత భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం హిందీ బెల్ట్‌లో బాగా హిట్ అయిన కారణంగా, ఈ సీక్వెల్‌పై భారీ ఆశలు ఉన్నాయి.
హిందీ మార్కెట్లో ‘పుష్ప 2’ భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పటివరకు హిందీ బెల్ట్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమా ‘బాహుబలి 2’. ఇది 511 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత స్థానంలో 295 కోట్ల నెట్ వసూళ్లతో ‘కల్కి’ ఉంది. ‘పుష్ప 2’ ఈ రెండు సినిమాల రికార్డులను అధిగమించడం కోసం సిద్దమవుతోంది.
The trailer for pushpa 2 drops soon so I was looking back at all my memories from Pushpa 1🔥🔥and I realised I hadn’t shared anything with you guys.. so here goes! ❤️❤️🔥
1- Srivalli sending you fulllll love! ❤️
2 #throwback to Your Pushpa and Srivalli from Russia 😎❤️🔥
3 The… pic.twitter.com/7TRpDGmFUm— Rashmika Mandanna (@iamRashmika) November 14, 2024
హిందీ మార్కెట్లో ‘పుష్ప 2’ కనీసం ‘బాహుబలి 2’ స్థాయికి చేరుకోవాలని, లేకపోతే ‘కల్కి’ 300 కోట్ల మార్క్‌ను దాటాలని అంచనా వేస్తున్నారు. ఇక ‘RRR’ 277 కోట్ల నెట్ వసూళ్లతో మూడవ స్థానంలో ఉంది.
‘పుష్ప 2’ హిందీ బెల్ట్‌లో తెలుగు సినిమాల ప్రాధాన్యతని నిరూపించడంలో కీలక పాత్ర పోషించనుంది. హిందీ మార్కెట్లో ఈ సినిమా 500 కోట్లను దాటితే అది గొప్ప విజయమవుతుంది. అందుకోసం ఈ నెల 17న విడుదల కాబోతున్న ‘పుష్ప 2’ ట్రైలర్‌కి మంచి స్పందన రావాల్సి ఉంది. ట్రైలర్ ఆకట్టుకుంటే సినిమా పట్ల ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరుగుతుందని చెప్పచ్చు.
‘పుష్ప 2’ ట్రైలర్ సూపర్ హిట్ అయితే, హిందీ బెల్ట్‌తో పాటు ఇతర పాన్ ఇండియా మార్కెట్లలో కూడా సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతుందన్న నమ్మకముంది. హిందీ మార్కెట్లో టాప్ లీగ్‌లో నిలబడేందుకు అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ఎంతవరకు వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.