Mr Bachchan Pre-release Business:
షాక్, మిరపకాయ్ సినిమాల తర్వాత మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో.. ప్రేక్షకుల ముందుకి వస్తున్న మూడవ సినిమా మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్స్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో అయినా రవితేజ మంచి కం బ్యాక్ ఇస్తే బాగుంటుంది.. అని అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ సినిమాకి ముందు 70 కోట్ల బడ్జెట్ అనుకున్నారట. నిజానికి ఈ ప్రస్తుతం ఉన్న రవితేజ మార్కెట్ కి.. ఈ బడ్జెట్ కూడా ఎక్కువ అని చెప్పాలి. ఇక అనుకోవడానికి 70 కోట్లు అనుకున్నా కూడా.. షూటింగ్ పూర్తయ్యే సమయానికి బడ్జెట్ 90 కోట్లకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఒక పాట షూటింగ్ పెండింగ్ లోనే ఉందట. మరి ఆ పాట షూటింగ్ పూర్తయ్యేసరికి బడ్జెట్ ఎంతవుతుందో చూడాలి.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 78 కోట్లు మాత్రమే జరిగింది. మరి ఫైనల్ రన్ పూర్తయ్యేసరికి.. సినిమా కలెక్షన్లు నిర్మాతలను గట్టెక్కిస్తాయా అంటే.. ఆ పరిస్థితులు కూడా కనిపించడం లేదు. మొదటగా చెప్పాలి అంటే మిస్టర్ బచ్చన్ ఒక రీమేక్ సినిమా. పైగా సినిమా విడుదలవుతున్న ఆగస్టు 15 రోజు ఇంకా నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. సినిమా కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినా కూడా.. కలెక్షన్లు భారీగా పడిపోతాయి.
మరోవైపు రవితేజ కి ప్రస్తుతం అంత మార్కెట్ లేదు అని చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో రవితేజ కెరియర్ వరుసగా ఫ్లాప్స్ తో నిండి ఉంది. చేసిన ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని సాధించలేకపోతోంది. గత రెండేళ్లలో వాల్తేరు వీరయ్య సినిమాలో చేసిన పాత్ర పక్కన పెడితే.. హీరోగా మూడు సినిమాల్లో నటించారు రవితేజ. అవే రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్. మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.
మరి ఏ నమ్మకంతో చిత్ర నిర్మాతలు.. ఇంత ఫ్లాప్ మార్కెట్ ఉన్న రవితేజ మీద.. ఇంత బడ్జెట్ పెట్టారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇంత రిస్క్ చేశాక.. సినిమా కనీసం యావరేజ్ గా అయినా ఆడుతుందో లేదో వేచి చూడాలి.