టాలీవుడ్లో ‘జాతిరత్నాలు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి’ పాత్రలో నటించిన ఈ బ్యూటీ తన నటనతో తొలి సినిమాతోనే కుర్రకారుని తనవైపు తిప్పుకుంది. ఈ సినిమా విడుదల అవ్వకముందే తన హైట్ తో ‘ఈవిడేంటి.. నా కంటే పొడుగుంది’ అని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను ఆశ్చర్యపరిచి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఇక ఫస్ట్ మూవీతోనే భారీ సక్సెస్ అందుకున్న ఫరియా.. ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
తెలుగమ్మాయి అయిన ఫారియా.. ‘జాతిరత్నాలు’ సినిమా విజయంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పటికే పలు పెద్ద నిర్మాణ సంస్థలు అమ్మడితో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్క సినిమా దెబ్బకి ఈ బ్యూటీకి ఇప్పుడు చేతి నిండా పనులు వచ్చి పడుతున్నాయని తెలుస్తోంది. కరోనా టైమ్ లో కూడా షాప్ ఓపెనింగ్స్ అంటూ ఫరియా బిజీబిజీగా గడుపుతోంది. ఒక్కో షాప్ ఓపెనింగ్ కి దాదాపుగా 15 లక్షల వరకు ఈ బ్యూటీ ఛార్జ్ చేస్తోందని టాలీవుడ్ కాస్టింగ్ ఏజెంట్స్ చెబుతున్నారు. ప్రస్తుతానికి తదుపరి ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రాకున్నా ఇప్పుడు ఇండస్ట్రీలో ఫరియాకి ఫుల్ క్రేజ్ ఉందనే విషయం వాస్తవం.