Kollywood flop movies 2024:
కొలీవుడ్ పరిశ్రమకు 2024 ఏడాది పెద్ద దెబ్బ తగిలింది. థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ సంవత్సరం కొలీవుడ్‌లో 241 సినిమాలు విడుదల కాగా, వాటిలో కేవలం 18 సినిమాలు మాత్రమే హిట్స్ అయ్యాయి. అయితే, నిర్మాతలు ఈ చిత్రాల కోసం రూ. 3,000 కోట్ల పెట్టుబడి పెట్టగా, 1,000 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయని తెలుస్తోంది.
పెద్ద హీరోల సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ఈ నష్టాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2, రజనీకాంత్ నటించిన వెట్టయ్యన్, సూర్య నటించిన కంగువా వంటి చిత్రాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. ఈ చిత్రాల కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేయగా, ఆర్థికంగా తిరిగి రావడం కష్టమైంది.
అయితే, మధ్యతరహా సినిమాలు కొంత మేరకు మెరుగైన ఫలితాలు సాధించాయని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. పెద్ద హీరోల సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ, కొన్ని మధ్యస్థాయి చిత్రాలు మంచి వసూళ్లు సాధించాయి.
ఇక 2025 సంవత్సరంపై కొలీవుడ్ పరిశ్రమ పెద్దలు ఆశలు పెట్టుకున్నారు. రానున్న సంవత్సరం రజనీకాంత్ కూలీ, విజయ్ 69వ సినిమా, కమల్ హాసన్ ఠగ్ లైఫ్, సూర్య 45వ సినిమా వంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధిస్తాయని అందరూ నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రాలు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడతాయన్న నమ్మకంతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ALSO READ: వామ్మో Mahalakshmi Scheme తో ఎన్ని ఉచిత బస్ ప్రయాణాలు జరిగాయో తెలుసా?