Upcoming Telugu Releases:
నిజానికి ఈ ఏడాది ఆగస్టు 15న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న.. పుష్ప 2 సినిమా విడుదల కావాలి. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల.. ఈ సినిమా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఇక స్వతంత్ర దినోత్సవం సందర్భంగా.. విడుదల కావాల్సిన సినిమాల జాబితా నుండి.. పుష్ప 2 వంటి స్టార్ హీరో సినిమా తప్పుకోగా.. చాలానే సినిమాలు విడుదల కి సిద్ధం అయ్యాయి.
ఇప్పుడు ఆగస్టు 15న ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు విడుదల కి సిద్ధమవుతున్నాయి. ఒక్క పుష్ప 2 సినిమా తప్పుకోవడం వల్ల ఐదు సినిమాలు విడుదల తేదీలు ఖరారు చేసుకున్నాయి. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది మాస్ మహారాజా రవితేజ.. హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా కనిపించనుంది.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, పాటలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఈమధ్య ఫ్లాప్స్ అందుకుంటున్నా రవితేజ ఈసారైనా హిట్ అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. హిందీలో సూపర్ హిట్ అయిన రైడ్ సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా.. డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.
నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 35 చిన్న కథ కాదు సినిమా కూడా అదే రోజు విడుదల కాబోతోంది. నందకిషోర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ పతకంపై రానా దగ్గుబాటి ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా కూడా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల కాబోతోంది.
కంచిపల్లి అంజిబాబు దర్శకత్వంలో కృష్ణ చైతన్య, నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రలు పోషించిన ఆయ్ సినిమా కూడా ఆగస్టు 15న విడుదల కాబోతోంది. పా రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న తంగాలన్ సినిమా కూడా తెలుగులో అదే టైటిల్ తో విడుదల కాబోతోంది. మరి ఈ ఐదు సినిమాలలో ఎన్ని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకుంటాయో వేచి చూడాలి.