Upcoming Telugu Movies:
ఈ మధ్యనే తిరిగి రీ ఓపెన్ అయిన థియేటర్లు ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాయి. ప్రతివారం ఏదో ఒక పెద్ద సినిమా విడుదల కాబోతోంది. ఇక అంతేకాకుండా ప్రతినెలా ఒక స్టార్ సినిమా కూడా విడుదలకి సిద్ధమవుతోంది సినిమా. డిసెంబర్లో అయితే ఇక ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదలకి రెడీ అవుతున్నాయి. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం.
ఆగస్టు మొదలవడమే సినిమాల సందడి తో మొదలు కాబోతోంది. ఆగస్టు 1న అశ్విన్ బాబు శివం భజే విడుదల కాబోతోంది. ఆగస్టు 2న అల్లు శిరీష్ బడ్డీ, కాంట్రవర్షియల్ స్టార్ రాజ్ తరుణ్ తిరగబడరా సామి, ఉషా పరిణయం, అలనాటి రామచంద్రుడు విడుదల అవుతున్నాయి. ఆగస్టు 9న నిహారిక కొణిదెల కమిటీ కుర్రోళ్ళు విడుదల కానుంది.
ఈసారి ఆగస్టు 15 న ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 సినిమాలు విడుదల అవుతున్నాయి. రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో పాటు 35 చిన్న కథ కాదు, ఆయ్, తమిళ్ సినిమా తంగాలన్ తెలుగు డబ్బింగ్ విడుదల కాబోతున్నాయి.
ఆగస్టు 23న మారుతి నగర్ సుబ్రమణ్యం విడుదల కాబోతోంది.నెలాఖరులో ఆగస్టు 29 న నాని సరిపోదా శనివారం విడుదల కానుంది.
సెప్టెంబర్ 5న విజయ్ ది గోట్ విడుదల కానుంది. సెప్టెంబర్ 6 న సుందరాకాండ, 7న దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ విడుదల అవుతున్నాయి. ఇక సెప్టెంబర్ ఆఖరికి 27న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర విడుదల అవుతోంది.
అక్టోబర్ లో కూడా 10న సూర్య కంగువ, 31న విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, అమరన్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే వెట్టాయన్ సినిమా కూడా అక్టోబర్ లో విడుదల కావాలి కానీ తేదీ ఇంకా ఖరారు కాలేదు.
నవంబర్ లో 9న సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తెలుసు కదా సినిమా విడుదల కావాలి. ఈమధ్యనే చిత్ర షూటింగ్ కూడా మొదలైంది. డిసెంబర్ 6న అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప 2 భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమా వాయిదా పడచ్చు అని కొందరు అంటున్నారు కానీ అనుకున్న తేదీ కే విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దిల్ రాజు కూడా గేమ్ చేంజర్ తో క్రిస్మస్ కి కలుద్దాం అన్నారు. కాబట్టి డిసెంబర్ 20 న ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువ. మరోవైపు డిసెంబర్ 20న నితిన్ రాబిన్ హుడ్, నాగ చైతన్య తండేల్ విడుదల కాబోతున్నాయి. కానీ గేమ్ చేంజర్ కూడా అదే రోజు విడుదల కాబట్టి ఈ చిత్రాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. విష్ణు కన్నప్ప కూడా డిసెంబర్ కే విడుదల అంటున్నారు కానీ తేదీ విషయంలో క్లారిటీ లేదు.