Upcoming re-releases:
ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 5 సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల గురించి పక్కన పెడితే, ఆగస్టు నెల మొత్తం రీ రిలీజ్ ల హడావిడి టాలివుడ్ లో ఎక్కువగా కనిపించనుంది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు 5 బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి.
జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మాస్ మహారాజా హీరోగా.. విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ అయిన విక్రమార్కుడు సినిమా జులై 27 న రీ రిలీజ్ కాబోతోంది. ఇక ఆగస్టు లో అయితే ప్రతి వారం ఏదో ఒక బ్లాక్ బస్టర్ సినిమా రీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. మొదటగా ఆగస్టు 2 న క్యూట్ కాంబో నాని, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఎటో వెళ్ళిపోయింది మనసు రీ రిలీజ్ అవుతోంది. గౌతమ్ మీనన్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు తీసిన అద్భుతమైన ప్రేమ కథా చిత్రం అది.
ఇక మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఏకంగా రెండు సినిమాలు రీ రిలీజ్ కి క్యూ కట్టాయి. మొదటగా తన కెరియర్ లో మొదటి బిగ్గెస్ట్ హిట్ అయిన ఒక్కడు సినిమా ఆగస్టు 8న రీ రిలీజ్ అవుతోంది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు నాడు మురారి సినిమా రీ రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం రాజమౌళి తో సినిమా చేస్తున్న మహేష్ బాబు ఇప్పట్లో వెండి తెర మీద కనిపించే దాఖలాలు లేవు. కాబట్టి ఈ రీ రిలీజ్ లే ఫ్యాన్స్ కి ఊరట అని చెప్పుకోవచ్చు.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఇంద్ర సినిమా రీ రిలీజ్ అవుతోంది. 2002 లో విడుదల అయిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయింది. షారుఖ్ ఖాన్ దేవదాస్ సినిమా తరువాత ఆ ఏడాది భారత దేశం మొత్తంమీద ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసుకున్న సినిమాలలో రెండవ స్థానం అందుకుంది. ఇంద్ర సేనా రెడ్డి పాత్రలో చిరంజీవి పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తుంది.
టాలివుడ్ కింగ్ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 29 న శివ సినిమా రీ రిలీజ్ అవుతోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో.. నాగ్ హీరోగా నటించిన శివ సినిమా ఇప్పటికీ ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కూడా తన కెరియర్ లో బిగ్ హిట్స్ అయిన.. సినిమాల జాబితా నుండి గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అవుతోంది. హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దీంతో పెద్ద సినిమాల కంటే.. ఈ రీ రిలీజ్ సినిమాకి ఎక్కువగా ఉన్నాయి అని.. ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు.