యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- పూజా హెగ్డే కంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ డైరెక్షన్‌లో వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను ఇప్పటికే కొంతవరకు పూర్తి చేశారు. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా లాక్‌డౌన్ విధించటంతో షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ సినిమాకు రాధేశ్యామ్ అనే టైటిల్ పరిశీలినలో ఉంది. దీంతో ప్రభాస్ అభిమానులు ‘రాధేశ్యామ్’ అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ యూరప్ లో ఎక్కువగా జరిగింది. ఇంకా కూడా అక్కడే చిత్రీకరణ జరపాల్సి ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లలేని పరిస్థితి. కనుక హైదరాబాద్ లోనే ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్స్ ను ఏర్పాటు చేసి అక్కడ పరిస్థితులను ఇక్కడ రీ క్రియేట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఈ చిత్రం కోసం 5 కోట్లతో భారీ హాస్పిటల్ సెట్ ను నిర్మిస్తున్నారట. నాలుగు అంతస్తుల ఆ హాస్పిటల్ లో ఆపరేషన్ థియేటర్.. ఐసీయూ.. జనరల్ వార్డ్ ఇంకా హాస్పిటల్ పరసరాలు వంటివి క్రియేట్ చేస్తున్నారు. అది కూడా 1980 కాలం నాటి వాతావరణంలో హాస్పిటల్ ను తీర్చి దిద్దుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సెట్ లో దాదాపుగా నెల రోజుల పాటు చిత్ర యూనిట్ సభ్యులు చిత్రీకరణ జరిపేందుకు సిద్దం అవుతున్నారు.