HomeTelugu Big StoriesGoodachari 2 కోసం మహేష్ బాబు కూడా చెయ్యని రిస్క్ చేస్తున్నారా?

Goodachari 2 కోసం మహేష్ బాబు కూడా చెయ్యని రిస్క్ చేస్తున్నారా?

Huge budget for Goodachari 2 raises the brows
Huge budget for Goodachari 2 raises the brows

Goodachari 2 Update:

అడివి శేష్ నటించిన స్పై యాక్షన్ సినిమా గూఢచారి స్పై థ్రిల్లర్ జానర్‌లో భారీ హిట్ అయిన చిత్రాలలో ఒకటి. ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతున్న గూఢచారి 2 (జీ2) మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవల, గూఢచారి విడుదల ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా, జి2 చిత్రానికి సంబంధించిన 6 కొత్త పోస్టర్లను విడుదల చేశారు. ఈ పోస్టర్లలో శేష్ ఎప్పటిలాగానే ఏజెంట్ పాత్రలో కనిపించారు. ఈ స్పై యాక్షన్ సినిమా రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. సినిమా మీద ఉన్న అంచనాల ప్రకారం.. గూడచారి సినిమా సక్సెస్ ప్రకారం చూస్తే.. ఆ మాత్రం బడ్జెట్ పరవాలేదు అనిపిస్తుంది కానీ.. అడవి శేషు మార్కెట్ ఇంకా అంతా పెరగలేదు.

ఆఖరికి మహేష్ బాబు నిర్మించిన మేజర్ సినిమా కూడా 60- 70 కోట్లు మాత్రమే వసూళ్లు చేయగలిగింది. మరి అలాంటిది మహేష్ బాబు కూడా చేయని రిస్క్ గూడచారి టు కోసం చిత్ర నిర్మాతలు ఎందుకు చేస్తున్నారు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. గూడచారి సినిమా కూడా కేవలం 6 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. 25 కోట్లు వసూలు నమోదు చేసుకుంది.

వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో, శేష్ సహరచయితగా ఉన్న ఈ జి2 సినిమా, అడివి శేష్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా మారింది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో భారీ స్థాయి సెట్ పీస్‌లు, థ్రిల్ ఇచ్చే యాక్షన్ సీక్వెన్సులు, కథలో అనూహ్యమైన మలుపులు ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకునేలా ఉంటాయి అని టాక్ నడుస్తోంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి నిర్మిస్తున్నారు. 2025 రెండవ అర్ధభాగంలో ఈ సినిమా విడుదల కానుంది. శేష్ అభిమానులు ఈ సినిమాకోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu