Amaravati Construction Cost:
గత ఐదేళ్లలో యేసీపీ పాలనలో పూర్తిగా నాశనమైన అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతికి జీవం పోసే ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. జిల్లాల కలెక్టర్ల సమావేశంలో ఈ పనుల పురోగతి గురించి ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
అధికారుల ప్రకారం, గత యేసీపీ పాలనలో అమరావతిలో ఎన్నో విధ్వంసకర సంఘటనలు జరిగాయి. యంత్రాలు ధ్వంసం చేయబడటమే కాకుండా, రోడ్లు తవ్వి పడేశారు, నిర్మాణ సామాగ్రి అమ్మేసి, పైపులు తొలగించేశారు. పలు నిర్మాణాలు పాడుచేసేశారు. కానీ ఇప్పుడు ఈ నాశన పరిస్థితిని అధిగమించి పునర్నిర్మాణ పనులు వేగంగా ప్రారంభించారు.
అమరావతిలో ప్రతి నిర్మాణం, రోడ్లను IIT మద్రాస్ మరియు IIT హైదరాబాదు ప్రొఫెసర్లు పరిశీలించి పునర్నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళిక ఆధారంగా పనులు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. గతంలో అమరావతి నిర్మాణంలో భాగస్వాములైన కన్సల్టెంట్లు, డిజైనర్లను తిరిగి నియమించారు.
ప్రభుత్వం రూ. 20,500 కోట్ల పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. త్వరలో టెండర్లు పిలిపించి పనులు వేగవంతంగా మొదలు కానున్నాయి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రూ. 15,000 కోట్లను నిధులుగా అందించగా, డిసెంబర్ 19న ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం జరుగనుంది. మొత్తం రూ. 31,000 కోట్ల నిధులు ప్రాజెక్టుకు కేటాయించబడ్డాయి.
ఈ నిధులతో అమరావతిలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేయడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. IT పార్క్, రోడ్లు, ఇతర నిర్మాణాలను త్వరలో పూర్తి చేసి అమరావతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రణాళిక అమలులో ఉంది.
ALSO READ: Bigg Boss 8 Telugu విన్నర్ కి ఎంత ప్రైజ్ మనీ వస్తుందంటే!