బాలీవుడ్‌లో హీరో హృతిక్ రోషన్ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థతో చర్చలు జరుగుతున్నాయని. మల్టీ మిలియన్ ప్రాజక్టుగా నిర్మాణం జరుపుకునే ఓ చిత్రంలో హృతిక్ స్పై పాత్రలో లీడ్ క్యారెక్టర్ ను పోషించే అవకాశం వుంది అని తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఆ స్టూడియో నిర్వహించిన అడిషన్స్ లో కూడా హృతిక్ పాల్గొన్నాడు. దానికి సంబంధించిన టేప్ ను రెండు వారాల క్రితమే హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థకు పంపినట్టు తెలుస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే ఇందులో హృతిక్ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ ఈ సినిమా ఫైనల్ అయితే కనుక ప్రస్తుతం చేస్తున్న ‘క్రిష్ 4’ తర్వాత హృతిక్ చేసే సినిమా ఇదే అవుతుందని అంటున్నారు. ఇక ఈ ప్రాజక్టు గురించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం హృతిక్ ‘క్రిష్ 4’ చిత్రంలో నటిస్తున్నాడు.