HomeTelugu Trendingహృతిక్‌ రోషన్‌ మాజీ భార్యకు రెండో పెళ్లి!

హృతిక్‌ రోషన్‌ మాజీ భార్యకు రెండో పెళ్లి!

Hrithik roshan ex wife suss
బాలీవుడ్ లో స్టార్‌ కపుల్ హృతిక్ రోషన్, సుసానే ఖాన్ లు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హృతిక్ రోషన్ బాలీవుడ్ నటి, సింగర్ సాబా అజాద్ తో డేటింగ్ చేస్తుండగా… తన ప్రియుడు అర్స్లాన్ గోనీతో సుసానే రిలేషన్ షిప్ లో ఉంది. తాజాగా సుసానే, ఆమె బోయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని… అయితే సుసానేకు ఇది రెండో పెళ్లి కావడం వల్ల.. వీరి మ్యారేజ్ చాలా సింపుల్ గా ఉండబోతోందని ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిన ఓ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది.

హృతిక్ రోషన్, సుసానేలు 14 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడిపోయారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ… పిల్లలతో అప్పుడప్పుడు సమయాన్ని కలిపి గడుపుతుంటారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu