జగన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లక్ష్యంగా చేసుకుంటుందట. ఇంతకంటే జోక్ మరొకటి ఉంటుందా ?, ఈ నీలి మీడియా కూలీ రాతలు ఇంకెన్నాళ్ళు ?, న్యాయస్థానాలు యెప్పుడైనా రాజ్యాంగాన్ని ,చట్టాలను లక్ష్యంగా చేసుకొని వాదప్రతి వాదాలు విని తీర్పుల యివ్వటం జరుగుతుంది. అంతేగానీ జగన్ రెడ్డి లాగా వ్యక్తులను లక్ష్యంగా చేస్కోవటం జరగదు. యిద్దరి వ్యక్తుల మధ్య ఆస్తి తగాదా వస్తే అందులో న్యాయం ఉన్న వ్యక్తికి అనుకూలంగానే కోర్టు తీర్పు ఇస్తోంది. అంతా మాత్రాన ఇద్దరిలో ఒక వ్యక్తికి కావాలని కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని భావిస్తే ఎలా ?,
జగన్ రెడ్డికి న్యాయస్థానం వ్యతిరేకంగా తీర్పులు ఇస్తే.. అది కావాలనే ఇచ్చింది అని ప్రజలని తప్పుదోవ పట్టించే యత్నం చేస్తోంది నీలి మీడియా. ఇవి చదువుకున్న వారెవరూ నమ్మేవి కావు. న్యాయ వ్యవస్టలు ఒక వ్యక్తిని కీర్తించవూ, లక్ష్యంగా చేసుకోవు. ఎందుకంటే ఏ వ్యక్తీ న్యాయ వ్యవస్థకంటే, రాజ్యాంగం కంటే ఎన్నడూ ఎక్కువ కాదు. అయినా, వ్యవస్థల మధ్య సందులు వెతికి వాటి మధ్య వైరుధ్యం భావాలని వ్యాప్తి చేయటం జగన్ రెడ్డి మీడియాకి సమంజసం కానేకాదు. ఎంత తెలివిగా అది చేసినా వ్యవస్థలు, ప్రజలు గమనిస్తూనే ఉంటారు అని సాక్షి మీడియా గుర్తించాలి.
శాసన కార్యనిర్వాహక వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో సమాంతరాలు అని జగన్ రెడ్డి కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడైనా న్యాయ వ్యవస్థకి రాజ్యాంగం చాలా ప్రాధాన్యం, అంతటినీ మరియూ అందరినీ కట్టడి చేసే ఎక్కువ అధికారం న్యాయ వ్యవస్థకి ఉంది. ఈ విషయాన్ని కూడా జగన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థకి మూలం న్యాయ వ్యవస్థే. అలాంటి న్యాయ వ్యవస్థని చెప్పు చేతల్లో పెట్టుకోవాలి జగన్ రెడ్డి అనుకోవటం ముమ్మాటికీ తప్పే.
అసలు గత 70 ఏళ్ళు పైబడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో కూడా తలేత్తని ఈ పరిస్థితి.. ఒక్క జగన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభలుతున్నది ఎందుకు ?, న్యాయ వ్యవస్థనే తప్పు పడుతున్న జగన్ రెడ్డిలో నీతి నిజాయితీ ఎంత ?, అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. జగన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వ్యవస్థలు కొత్తవి కావు, జగన్ రెడ్డి పుట్టక ముందు నుంచి ఉన్నవే. మరెందుకు? జగన్ రెడ్డిని అవి టార్గెట్ చేస్తాయి ?, అయినా, వ్యక్తిగత కక్షలని వ్యవస్థల మీద గుంభనంగా రుద్దుతున్న జగన్ రెడ్డి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
న్నా తక్కువే.