స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఈ మధ్యకాలంలో తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అనుమతి లేకుండా తన పాటలు వాడుకుంటున్నారంటూ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఆయన తన 76వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలో ఇళయరాజా కోసం ఓ కచేరీ వేడుకను నిర్వహించారు. ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జేసుదాస్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
అయితే కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ సెక్యూరిటీ గార్డు మంచి నీళ్ల సీసాలు ఇవ్వడానికి స్టేజ్ పైకి వచ్చారు. దాంతో ఇళయరాజా అతని తీరుపై మండిపడ్డారు. ‘అనుమతి లేకుండా స్టేజ్‌పైకి వచ్చి కార్యక్రమాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావ్?’ అని తిట్టిపోశారు. దాంతో సదరు వ్యక్తి క్షమాపణలు చెబుతూ ఇళయరాజా కాళ్లు పట్టుకున్నారు. అంతేకాదు.. రూ.10 వేలు ఇచ్చి సీట్లు బుక్ చేసుకున్న వారి స్థానాల్లో రూ.500, రూ.1000 ఇచ్చి సీట్లు కొనుక్కున వారు కూర్చున్నారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇళయరాజా తిడుతున్న సమయంలో రికార్డ్ అయిన వీడియో ఒకటి ట్విటర్‌లో వైరల్ అవుతోంది.
— மீனவன் ஐயர் (@itzjackmails) June 2, 2019