
Nagarjuna Fitness Secrets:
టాలీవుడ్ కింగ్ నాగార్జున 65 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయన స్టైలిష్ లుక్స్, ఫిట్‌నెస్ మంత్రం, యువతకు కూడా స్ఫూర్తిగా మారింది. మరి, ఆయన ఎలాంటి డైట్ పాటిస్తారో, రోజుకు ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవాలా?
నాగార్జున నిత్యం ఒక స్ట్రిక్ట్ డైట్‌ను ఫాలో అవుతారు. ఉదయం తేలికపాటి ఆహారం తీసుకుంటారు, మధ్యాహ్నం సరిపడా భోజనం, రాత్రికి 7:30 లోపే డిన్నర్ పూర్తి చేసేస్తారు. అంతేకాదు, 12:12 ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా చేస్తారు. అంటే 12 గంటల పాటు మాత్రమే ఆహారం తీసుకుని, మిగతా 12 గంటలు ఉపవాసం చేస్తారు.
అయితే, అసలు షాకింగ్ విషయం ఏంటంటే, ఆయన రోజుకు రూ. 10,000 వరకు తన ఆహారంపై ఖర్చు పెడతారు! పర్సనల్ చెఫ్స్ ద్వారా ఆయనకు ప్రత్యేకమైన ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు సమతుల్యంగా ఉంటాయి.
రోజుకు రూ. 10,000 అంటే నెలకు రూ. 3 లక్షలు! ఇది ఏకంగా మంచి సాలరీ తీసుకునే ఐటీ ఉద్యోగి నెల జీతంతో సమానం. ఈ వార్త విన్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కానీ, ఈ డెడికేషన్ వల్లే 65 ఏళ్ల వయసులోనూ నాగ్ ఫిట్‌గా, యంగ్‌గా కనిపిస్తూ అందరికీ ఇన్స్పిరేషన్‌గా నిలుస్తున్నారు.