కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత గారే నేటి మన రాజకీయ నాయకురాలు. వంగా గీత గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వంగా గీత, కాకినాడ పట్టణంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం గీత పొలిటికల్ సైన్స్, సైకాలజీ, లా లలో పీజీలు పూర్తి చేశారు. గీత భర్త విశ్వనాథ్ తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. భర్త స్ఫూర్తి తో , తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన గీత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా ప్రోత్సహించడం వల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీ లో కీలకమైన నాయకురాలిగా ఎదిగారు.
అయితే 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ లోకి వంగా గీత గారు చేరారు. ఆ సమయంలో జిల్లా రాజకీయాల్లో కూడా ఆమె ఎంతో కీలకంగా వ్యవహరించారు. వంగా గీత 1995-2000 వరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా , 2000-06 వరకు రాజ్యసభ సభ్యురాలిగా , 2009-14 పిఠాపురం ఎమ్మెల్యే గా ఎన్నిక అయ్యారు. ఐతే, రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాల్లో స్తబ్దత వహించిన గీత, 2019 ఎన్నికలకు ముందు టీడీపీ లో జాయిన్ అయ్యి, మళ్లీ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నం చేశారు.
ఐతే, చంద్రబాబు మాత్రం వంగా గీత గారికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో.. జగన్ సమక్షంలో వంగా గీత వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ పార్టీ తరఫున 2019 లో కాకినాడ ఎంపీగా ఎన్నికయ్యారు. జగన్ రెడ్డి దగ్గర కూడా ఆమె మొదట ఎమ్మెల్యే టికెట్ నే ఆశించారు. కానీ, అప్పటి రాజకీయ పరిస్థితులు కారణంగా జగన్ ఆమెను ఎంపీగా పోటీ చేయమని కోరారు. ఇక 2024 ఎన్నికల్లో కచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అని జగన్ ఆమెను అభయం ఇచ్చారు. అందుకే వంగా గీత ప్రస్తుతం ఎంపీ గా ఉన్నప్పటికీ, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు.
ముఖ్యంగా 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున వంగా గీత పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ రాజకీయ నాయకురాలిగా వంగా గీత గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో వంగా గీత పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో వంగా గీత పరిస్థితేంటి ?, అసలు ఆమెకు మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ ఉందా ? తెలుసుకుందాం రండి.
వచ్చే ఎన్నికల్లో వంగా గీత పరిస్థితి బాగానే ఉండేలా కనిపిస్తోంది. ఇక ఆమె గ్రాఫ్ విషయానికి వస్తే.. వంగా గీత కు ప్రజల్లో ఇంకా బలమైన పట్టు ఉంది. పైగా వంగా గీత తీరు కూడా ఎంతో మర్యాదపూర్వకంగా ఉంటుంది. అలాగే వంగా గీత నిత్యం ప్రజల్లో ఉండటానికి ప్రయత్నిస్తుంటుంది. అలాగే ప్రజల సమస్యలను కూడా ఆమె బాగానే తీర్చింది అని వంగా గీత కి మంచి పేరు ఉంది. మొత్తంగా ఒక రాజకీయ నాయకురాలిగా వంగా గీత గ్రాఫ్ బాగుంది. కాబట్టి వంగా గీత కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్నట్టే ఉంది.