ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. కాటసాని రాంభూపాల్ రెడ్డి. ప్రస్తుతం ప్రజల్లో కాటసాని రాంభూపాల్ రెడ్డి పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. ఉమ్మడి కర్నూలు జిల్లా అవుకు మండలం గుండ్ల సింగవరం గ్రామంలో సంపన్న వ్యవసాయ కుటుంబంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రాంభూపాల్ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేశారు. రాంభూపాల్ కుటుంబ నేపథ్యంలోకి వెళ్తే.. కర్నూల్ జిల్లాలోని ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో ఒకటి. ఇతని బాబాయ్ కుమారుడు కాటసాని రామిరెడ్డి బనగానపల్లె ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఫ్యాక్షన్ రాజకీయాల్లో తమ కుటుంబాన్ని, అనుచర వర్గాన్ని రక్షించుకునేందుకు అతి పిన్న వయస్సులోనే రాజకీయాల్లో అడుగుపెట్టి గుండ్ల శింగవరం గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1985 లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నుండి పాణ్యం ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారిగా విజయం సాధించారు. 1989, 1994, 2004, 2009లలో అదే పార్టీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 లో జరిగిన రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పాణ్యం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత బీజేపీ పార్టీలో చేరి కొంత కాలం ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు.
2018 లో ఆ పార్టీకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో పాణ్యం నుంచి పోటీ చేసి ఆరో సారి విజయం సాధించారు. ఇంతకీ, రాజకీయ నాయకుడిగా కాటసాని రాంభూపాల్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో కాటసాని రాంభూపాల్ రెడ్డిపై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో కాటసాని రాంభూపాల్ రెడ్డి పరిస్థితేంటి ?, మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఉందా ?, చూద్దాం రండి. కాటసాని రాంభూపాల్ రెడ్డి వ్యక్తిగతంగా మరియు రాజకీయంగా వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు
ఐతే, ఫ్యాక్షన్ వర్గ పోరులో కాటసాని రాంభూపాల్ రెడ్డి కుటుంబం చాలా నష్టపోయింది. అయినప్పటికీ నంద్యాల పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో బలమైన అనుచరగణం కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఉంది. పైగా కాటసాని రాంభూపాల్ రెడ్డికి వ్యక్తిగతంగా మంచిపేరు ఉంది. అయిన్నప్పటికీ నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరుల వైఖరి అసలు బాగాలేదు. పైగా వారంతా అవినీతి చేస్తూ.. కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఉన్న మంచి పేరును చెడగొడుతున్నారు. ఈ నేపథ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి రాజకీయంగా చాలా నష్టపోతున్నారు. గ్రాఫ్ తగ్గకపోయినా.. ఇప్పటికైనా కాటసాని రాంభూపాల్ రెడ్డి మేల్కొంటే.. ఆయనకే మంచిది.