Homeతెలుగు వెర్షన్గడికోట శ్రీకాంత్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ?

గడికోట శ్రీకాంత్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ?

How is the graph of Gadikota Srikanth Reddy how will it be in the next election

ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. గడికోట శ్రీకాంత్ రెడ్డి. ప్రస్తుతం ప్రజల్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. ఉమ్మడి కడప జిల్లా రామాపురం మండలం సుద్దమల్ల గ్రామ పంచాయతీ పరిధిలోని యర్రంరెడ్డిగారి పల్లె గ్రామంలో ప్రముఖ రాజకీయ కుటుంబంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం శ్రీకాంత్ కర్ణాటక లోని తుమకూరు ఎస్. ఐ. టి కళాశాలలో ఇంజినీరింగ్ విభాగంలో బీఈ పూర్తి చేశారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు అమెరికా లో సాఫ్ట్వేర్ కంపెనీ మరియు పలు వ్యాపారాలు నిర్వహించారు.

గడికోట శ్రీకాంత్ రెడ్డి కుటుంబ నేపథ్యంలోకి వెళ్తే.. ఆయన తండ్రి గడికోట మోహన్ రెడ్డి బంధువులు గడికోట రామ సుబ్బారెడ్డి మరియు గడికోట ద్వారకానాథ్ రెడ్డి లు సైతం లక్కిరెడ్డి పల్లె నుంచి ఎమ్మెల్యే లుగా ప్రాతినిధ్యం వహించారు. శ్రీకాంత్ రెడ్డి కూడా తన తండ్రీ స్ఫూర్తి తో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదట కాంగ్రెస్ పార్టీ తరుపున 2009 లో రాయచోటి నుండి పోటీ చేసి ఎమ్మెల్యే గా విజయం సాధించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ లో అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వచ్చి ఆయన స్థాపించిన వైసీపీ పార్టీ లో చేరారు.

ఈ క్రమంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి తనఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి 2012 లో జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ నుండి పోటి చేసి విజయం సాధించారు. 2014, 2019 లలో వైసీపీ తరుపున అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. 2019 నుండి ప్రస్తుతం వరకు గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్నారు. వైఎస్ కుటంబానికి కడప జిల్లాలో రాజకీయ విధేయులుగా ఉన్న కుటుంబాల్లో గడికోట కుటుంబం కూడా ఒకటి. ఆ కుటుంబానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ కి అత్యంత ఆత్మీయుడు కూడా.

ఇంతకీ, రాజకీయ నాయకుడిగా గడికోట శ్రీకాంత్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి పరిస్థితేంటి ?, అసలు మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కి ఉందా ?, చూద్దాం రండి. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న గడికోట శ్రీకాంత్ రెడ్డికు ప్రజల్లో మంచి పేరే ఉంది. ఆయన గ్రాఫ్ కూడా పెరుగుతూ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా గడికోట శ్రీకాంత్ రెడ్డి కచ్చితంగా గెలిచే సత్తా ఉంది. అయితే, గడికోట శ్రీకాంత్ రెడ్డికు మంత్రి కావాలని కోరిక. కానీ, ఆ పదవి మాత్రం గడికోట శ్రీకాంత్ రెడ్డికి అందని ద్రాక్షగానే ఉండిపోయింది. ఈ విషయంలో రాయచోటి ప్రజల్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి పై సానుభూతి కూడా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu