ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. ‘అనగాని సత్య ప్రసాద్’. ప్రస్తుతం ప్రజల్లో అనగాని సత్య ప్రసాద్ పరిస్థితేంటి ?, వచ్చే ఎన్నికల్లో అనగాని సత్య ప్రసాద్ గ్రాఫ్ ఎలా ఉండబోతుంది ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. ఉమ్మడి గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామంలో అనగాని సత్య ప్రసాద్ జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం హైదరాబాద్ లోని అన్వర్ ఉలూం కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. సత్యప్రసాద్ రాజకీయాల్లో రాకముందు హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఒకానొక సమయంలో అత్యధిక ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కూడా అనగాని సత్య ప్రసాద్ గుర్తింపబడ్డారు. రియల్ ఎస్టేట్ మాత్రమే కాకుండా హాస్పిటల్ మరియు ఇతరత్రా వ్యాపారాలు కూడా అనగాని సత్య ప్రసాద్ కి ఉన్నాయి.
అనగాని సత్య ప్రసాద్ కుటుంబ నేపథ్యం లోకి వెళ్తే.. వీరి పెదనాన్న అనగాని భగవతరావు రాజకీయ దిగ్గజం, మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు కీలకమైన మంత్రి పదవులు నిర్వహించారు. తన పెదనాన్న రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2014, 2019 లలో వరుసగా రెండుసార్లు రేపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఇంతకీ రాజకీయ నాయకుడిగా అనగాని సత్య ప్రసాద్ గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో అనగాని సత్య ప్రసాద్ పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో అనగాని సత్య ప్రసాద్ పరిస్థితి ఎలా ఉండబోతుంది ?, ఇప్పుడున్న సమాచారం ప్రకారం.. అనగాని సత్య ప్రసాద్ కి మళ్లీ గెలిచే అవకాశం ఉంది. దీనికి ముఖ్య కారణం సత్యప్రసాద్ రేపల్లె ఎమ్మెల్యే గా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. అందువల్లే 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్ హవా కొనసాగినా రేపల్లె లో మాత్రం అనగాని సత్య ప్రసాద్ గెలవడం జరిగింది.
సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండటం కారణంగా అనగాని సత్య ప్రసాద్ కి రాజకీయాలు బాగా అబ్బాయి. దీనికితోడు అనగాని సత్య ప్రసాద్ కి ప్రజల్లో మంచి పేరు ఉంది. ఆయన గ్రాఫ్ కూడా పెరుగుతూ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా అనగాని సత్య ప్రసాద్ కి కచ్చితంగా గెలిచే సత్తా ఉంది. అయితే, అనగాని సత్య ప్రసాద్ కి మంత్రి కావాలని కోరిక. కానీ, ఆ పదవి మాత్రం ఇన్నాళ్లు ఆయనకి అందని ద్రాక్షగానే ఉండిపోయింది. అయితే, 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే.. అనగాని సత్య ప్రసాద్ కచ్చితంగా మంత్రి అవుతారు.