ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. ఎం.వి.వి.సత్యనారాయణ. వైసీపీ ఎంపీగా పాపులర్ అయిన ఎం.వి.వి.సత్యనారాయణ గురిం చి చెప్పుకోవడానికి ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. పేరుకు రాజకీయ నాయకుడే అయినా, ఎం.వి.వి.సత్యనా రాయణ ఓ విలన్ కూడా. అలాగే నిర్మాత కూడా. నటుడిగా స్టార్ డమ్ తెచ్చుకుని.. రాజకీయాల్లోకి రావాలని అనుకున్నప్పటికీ.. సినిమాల్లో ఎం.వి.వి.సత్యనారా యణ కి అదృష్టం దక్కలేదు. ఐతే, వ్యాపారవేత్తగా ఎం.వి.వి.సత్యనా రాయణకి కాలం కలిసి వచ్చింది. దాంతో రాజకీయ నాయకుడిగా ఎం.వి.వి.సత్యనారాయణ ఓ స్టెప్ ముందుకు వేశారు. మరి ఎం.వి.వి.సత్యనారా యణ పరిస్థితేంటి ?, వచ్చే ఎన్నికల్లో ఎం.వి.వి.సత్యనారా యణ గ్రాఫ్ ఎలా ఉండబోతుంది ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి.
ఎం.వి.వి గా వైజాగ్ ప్రజలకు పరిచయం అయిన ఎం.వి.వి.సత్యనారాయణ అసలు పేరు ఏమిటో తెలుసా ?, ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణ చౌదరి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం ఉండ్రాజవరం గ్రామంలో ఆయన జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సత్యనారాయణ 10 వ తరగతి వరకు చదువుకున్నారు. సత్యనారాయణ రాజకీయాల్లో రాకముందు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండేవారు. వైజాగ్ లో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఒకరు. సత్యనారాయణ క్రియాశీలక రాజకీయాల్లో రాకముందు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా ఉండేవారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకొని విశాఖపట్నం లోక్ సభ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఎం.వి.వి.సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు సినీ రంగంలో కూడా ప్రముఖంగా పని చేయడం కారణంగా ఆయనకు ఫుల్ పాపులారిటీ ఉంది. పలు తెలుగు, కన్నడ సినిమాలు ఆయన నిర్మించారు. ఇంతకీ, రాజకీయ నాయకుడిగా ఎం.వి.వి.సత్యనారాయణ గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో ఎం.వి.వి.సత్యనారాయణ పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ ఎం.వి.వి.సత్యనారాయణ కి ఉందా ? వంటి అంశాలు పరిశీలిస్తే.. ఎం.వి.వి.సత్యనారాయణ మళ్లీ గెలవడం కష్టమే. అందుకు ప్రధాన కారణం.. అవినీతి ఆరోపణలే.
నిజానికి సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నప్పటి నుంచే, అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్ లో జరిగిన పలు వ్యవహారాల్లో ఎంపీ గారి హస్తం కూడా ఉందని విశాఖ వాసుల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దీనికితోడు ప్రత్ యర్థుల మీద పైచేయి సాధించడం కోసం ఎం.వి.వి.సత్యనా రాయణ రాజకీయ కక్షలకు దిగాడు అని టాక్ ఉంది. ప్రస్తుతానికి అయితే, ఆయన ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఈ క్రమంలో ఎం.వి.వి.సత్యనారాయణ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అసలు ఒక ఎంపీ ఏం చేయగలడు ?, అసలేం చేస్తాడు ?, తనను గెలిపించిన ప్రజలకు తనేం చేయగలడు ? లాంటి విషయాల్లో కూడా ఎం.వి.వి.సత్యనారాయణ కి ఏ మాత్రం అవగాహన లేదు. కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో ఎం.వి.వి.సత్యనారా యణ గెలవడం జరిగే పని కాదు.