ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. మూలే సుధీర్ రెడ్డి. ప్రస్తుతం ప్రజల్లో మూలే సుధీర్ రెడ్డి పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. ఉమ్మడి కడప జిల్లా యర్రగుంట్ల మండలం నిడుజివ్వి గ్రామంలో ప్రముఖ రాజకీయ కుటుంబంలో మూలే సుధీర్ రెడ్డి జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సుధీర్ రెడ్డి మండ్య లోని ఎమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మరియు అనస్థీషియాలో డిప్లొమా పూర్తి చేశారు. సుధీర్ రాజకీయాల్లోకి రాకముందు వైద్యుడిగా పనిచేశారు. సుధీర్ కుటుంబ నేపథ్యం లోకి వెళ్తే.. ఆయన పెదనాన్న మైసూరారెడ్డి మాజీ మంత్రి మరియు ప్రముఖ రాజకీయ నాయకుడు. సుధీర్ రెడ్డి కుటుంబం తొలుత కాంగ్రెస్ పార్టీ లో ఉండేది.
ఐతే, అనంతర కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా సుధీర్ రెడ్డి, జగన్ రెడ్డి సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకొని 2016లో జమ్మలమడుగు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. ఇంతకీ, రాజకీయ నాయకుడిగా మూలే సుధీర్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో మూలే సుధీర్ రెడ్డి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో మూలే సుధీర్ రెడ్డి పరిస్థితేంటి ?, అసలు మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ మూలే సుధీర్ రెడ్డి కి ఉందా ?, చూద్దాం రండి.
మూలే సుధీర్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సపోర్ట్ ఉంది. జగన్ రెడ్డి పార్టీకి సంబంధించిన కొన్ని పర్సనల్ వ్యవహారాలను సుధీర్ రెడ్డే చూసుకుంటాడని టాక్ ఉంది. జగన్ రెడ్డికి ఉన్న విశ్వాస పాత్రుల్లో మూలే సుధీర్ రెడ్డి కూడా ఒకరు. ఇక మూలే సుధీర్ రెడ్డి రాజకీయ జీవితంలో ఎలాంటి వివాదాలు లేకపోయినా… ఈ మధ్య ఆయన పై ప్రజల్లో వ్యతిరేఖత పెరుగుతూ వస్తోంది. నిజానికి మూలే సుధీర్ రెడ్డికి వ్యక్తిగతంగా చాలా మంచి పేరు ఉంది. పేదవారికి ఆయన నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు.
ఐతే, మూలే సుధీర్ రెడ్డి మంచి వారు అయినప్పటికీ.. ఆయన చుట్టూ ఉన్నవారి కారణంగా ఆయనకు చెడ్డపేరు వస్తోంది. ఎమ్మెల్యే గా మూలే సుధీర్ రెడ్డి ఎన్నికైన నాటి నుంచి సుధీర్ రెడ్డి అనుచరులు పలు అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సుధీర్ రెడ్డి అనుచరుల పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. మొత్తమ్మీద తన అనుచరుల దుందుడుకు చర్యల వల్ల సుధీర్ రెడ్డి ప్రతిష్ట నియోజకవర్గంలో దెబ్బతింటుంది. ఇదే విషయాన్ని అక్కడి ప్రజలు అంగీకరిస్తున్నారు. ఇదే విధంగా సుధీర్ రెడ్డి అనుచరుల అరాచకాలు కొనసాగితే.. మూలే సుధీర్ రెడ్డి కి వచ్చే ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ ఉండదు.