ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. కోన రఘుపతి. ప్రస్తుతం ప్రజల్లో కోన రఘుపతి పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లలో కోన రఘుపతి జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కోన రఘుపతి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కళాశాలలో బీకాం పూర్తి చేశారు. రాజకీయాల్లో రాకముందు కోన రఘుపతి వ్యాపార రంగంలో ఉండేవారు. కోన రఘుపతికి రియల్ ఎస్టేట్ మరియు ఇతరత్రా వ్యాపారాలు ఉన్నాయి.
ఇక కోన రఘుపతి కుటుంబ నేపథ్యం లోకి వెళ్తే.. ఆయన తండ్రి కోన ప్రభాకరరావు కాంగ్రెస్ పార్టీ రాజకీయ దిగ్గజం మరియు గవర్నర్ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తన తండ్రి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన కోన రఘుపతి 2009 ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకొని 2014, 2019 లలో బాపట్ల నియోజకవర్గం నుండి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 నుండి ప్రస్తుతం వరకు రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కోన రఘుపతి కుటుంబానికి సినీ పరిశ్రమతో కూడా అనుబంధం ఉంది. రఘుపతి తండ్రి ప్రభాకరరావు రాజకీయాల్లో రాకముందు నటుడిగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. అన్న కుమారుడు కోన వెంకట్ సైతం సినీ పరిశ్రమలో అగ్రశ్రేణి కథా రచయిత, తన కుమార్తె నీరజ కోన సైతం సినీ పరిశ్రమలో అగ్రశ్రేణి హెయిర్ డ్రెస్సర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే లలో కోన రఘుపతి ఒకరు. ఇంతకీ, రాజకీయ నాయకుడిగా కోన రఘుపతి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో కోన రఘుపతి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో కోన రఘుపతి పరిస్థితేంటి ?, అసలు మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ కోన రఘుపతికి ఉందా ?, చూద్దాం రండి.
ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న బలమైన రాజకీయ నాయకుల్లో కోన రఘుపతి కూడా ఒకరు. నిజానికి కోన రఘుపతికి పెద్దగా రాజకీయ అనుభవం లేదు. కానీ కోన రఘుపతికి బాపట్ల నియోజకవర్గంలో బలమైన ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు ఆయన తన బాపట్ల నియోజకవర్గం కోసం బాగా కష్టపడుతున్నారు. జగన్ రెడ్డి మొప్పు పొంది, తన నియోజకవర్గానికి నిధులు కూడా తెచ్చుకున్నారు. దీంతో, బాపట్ల నియోజకవర్గంలో చాలావరకు కోన రఘుపతి మంచి పనులు చేయగలిగారు. కాబట్టి, వచ్చే ఎన్నికల్లో కోన రఘుపతి గెలిచే ఛాన్స్ ఉంది.