ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. కిలివేటి సంజీవయ్య. ప్రస్తుతం ప్రజల్లో కిలివేటి సంజీవయ్య పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. ఉమ్మడి నెల్లూరు జిల్లా తడ మండలం కడలూరు గ్రామంలో దళిత కుటుంబంలో కిలివేటి సంజీవయ్య జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం నెల్లూరు జిల్లా విద్యా నగర్ లోని ప్రముఖ ఎన్.బి. కె. ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తి చేశారు. సంజీవయ్య రాజకీయాల్లో రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గృహ నిర్మాణ శాఖలో ఇంజనీర్ ఉన్నతాధికారిగా పనిచేసేవారు.
సంజీవయ్య కుటుంబ నేపథ్యం లోకి వెళ్తే.. ఆయన మామయ్య ( కిలివేటి సంజీవయ్య భార్య తండ్రి) పసల పెంచలయ్య మాజీ మంత్రి మరియు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన దళిత నాయకుడు. సంజీవయ్య తన మామ పెంచలయ్య ప్రోత్సాహంతో ఉద్యోగానికి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన ముద్ర వేయడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు.
కానీ, కిలివేటి సంజీవయ్య ప్రయత్నం పెద్దగా ఫలించడం లేదు. దళితుడు కావడం కిలివేటి సంజీవయ్య ఎదుగుదలకు పెద్ద అడ్డంకిగా మారింది. వైఎస్ జగన్ తో ఎంత సాన్నిహిత్యంగా ఉన్నా.. కిలివేటి సంజీవయ్యను మాత్రం జగన్ రెడ్డి దిగువస్థాయి వ్యక్తిగానే చూస్తున్నాడు. ఇంతకీ, రాజకీయ నాయకుడిగా కిలివేటి సంజీవయ్య గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో కిలివేటి సంజీవయ్య పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో కిలివేటి సంజీవయ్య పరిస్థితేంటి ?, అసలు మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ కిలివేటి సంజీవయ్యకి ఉందా ?, చూద్దాం రండి.
సుదీర్ఘ కాలం రాజకీయాల్లో లేకపోయినా కిలివేటి సంజీవయ్యకి రాజకీయాలు బాగా అబ్బాయి. దీనికితోడు కిలివేటి సంజీవయ్యకి ప్రజల్లో మంచి పేరే ఉంది. ఆయన గ్రాఫ్ కూడా పెరుగుతూ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా కిలివేటి సంజీవయ్య కచ్చితంగా గెలిచే సత్తా ఉంది. అయితే, కిలివేటి సంజీవయ్య మంత్రి కావాలని కోరిక. కానీ, ఆ పదవి మాత్రం కిలివేటి సంజీవయ్య కి అందని ద్రాక్షగానే ఉండిపోయింది.
సంజీవయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయిన నాటి నుండి నేటి వరకు పార్టీ అగ్ర శ్రేణి నాయకులతో అంతగా కలవలేకపోయారు. ఈ విషయాన్ని వారి పార్టీ వారే చెబుతున్నారు. కాబట్టి, కిలివేటి సంజీవయ్యకి జగన్ రెడ్డి ఎన్నడూ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడు అని, వైసీపీలో కిలివేటి సంజీవయ్య ఎన్ని ఏళ్లు ఉన్నా.. ఆయన వ్యక్తిగతంగా ఎదగరు అని కిలివేటి సంజీవయ్య సన్నిహితులే అభిప్రాయపడుతున్నారు.