Homeతెలుగు వెర్షన్ఏలూరి సాంబశివరావు గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ?

ఏలూరి సాంబశివరావు గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ?

How is Eluri Sambasiva Raos graph How will it be in the next election
ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే…ఏలూరి సాంబశివరావు.  ప్రస్తుతం ప్రజల్లో ఏలూరి సాంబశివరావు పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. ఏలూరి సాంబశివరావు ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కోనంకి గ్రామంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సాంబశివరావు హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ (హార్టికల్చర్), ఏం ఎస్సీ (హార్టికల్చర్) పూర్తి చేశారు. సాంబశివరావు రాజకీయాల్లో అడుగుపెట్టక ముందు ప్రభుత్వ హార్టికల్చర్ అధికారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేశారు. అనంతరం వ్యాపార రంగంలో అడుగుపెట్టి నోవా అగ్రిటెక్ పేరుతో వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారంలో ఉన్నారు. 
 
సాంబశివరావు రాజకీయాల్లో తొలి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలైన తెలుగు రైతు మరియు సాంకేతిక నిపుణుల రాష్ట్ర కమిటీలలో సభ్యులుగా పనిచేశారు. 2013 లో పర్చూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యుడిగా నియమితులైన సాంబశివరావు 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు పర్చూరు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. 2014-19 వరకు అసెంబ్లీ లో ప్రభుత్వ విప్ గా బాధ్యతలు నిర్వహించారు. సాంబశివరావు వ్యక్తిగతంగా చాలా సౌమ్యుడు మరియు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తారు అని పేరుంది. 
 
ఇంతకీ రాజకీయ నాయకుడిగా ఏలూరి సాంబశివరావు గ్రాఫ్ ఎలా ఉంది ?,  ప్రజల్లో ఏలూరి సాంబశివరావు పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో ఏలూరి సాంబశివరావు పరిస్థితి ఎలా ఉండబోతుంది ?, చూద్దాం రండి. ఏలూరి సాంబశివరావు బాగా చదువుకున్న వ్యక్తి. తన అనుచరుల పిల్లలను బాగా చదివిస్తున్నాడు.  కానీ, ఏలూరి సాంబశివరావు తన నియోజకవర్గం మీద పట్టు సాధించలేకపోవడం విశేషం. ఎమ్మెల్యే తరపున నియోజకవర్గ టీడీపీ బాధ్యతలను ఏలూరి సాంబశివరావు  బంధువు ఒక అతను  చూస్తున్నారని స్థానిక ప్రజల సమాచారం.  
 
అయితే, వచ్చే ఎన్నికల్లో ఏలూరి సాంబశివరావు గెలిచే అవకాశం ఉంది. జగన్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకత కారణం ఒక్కటి అయితే, వ్యక్తగతంగా ఏలూరి సాంబశివరావుకి మంచి పేరు ఉంది. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో లేకపోయినా  ఏలూరి సాంబశివరావుకి రాజకీయాలు బాగా అబ్బాయి.  దీనికితోడు ఏలూరి సాంబశివరావు కి ప్రజల్లో మంచి బలం ఉంది. ఆయన గ్రాఫ్ కూడా పెరుగుతూ వస్తోంది. కాబట్టి, వచ్చే ఎన్నికల్లో  ఏలూరి సాంబశివరావుకి కచ్చితంగా గెలిచే సత్తా ఉంది.  ఈ విషయాన్ని వైసీపీ పార్టీ వారే చెబుతున్నారు.    

Recent Articles English

Gallery

Recent Articles Telugu