Homeతెలుగు వెర్షన్అవినాష్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో అవినాష్ పరిస్థితేంటి ?

అవినాష్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో అవినాష్ పరిస్థితేంటి ?

avinash reddy
ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్, నేపథ్యం విషయానికి వస్తే.. ‘అవినాష్ రెడ్డి’. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వినని తెలుగు వ్యక్తి ఉండదు. వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో భాగంగా అవినాష్ రెడ్డి నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యారు. చాలా సైలెంట్ అండ్ డేంజరస్ పొలిటీషియన్ గా అవినాష్ రెడ్డికి పేరు ఉంది. జగన్ కి ఏం కావాలి ?,  జగన్ కోసం తానూ  ఏం చేయాలి ? లాంటి వ్యవహారాల గురించి తప్ప, అవినాష్ రెడ్డి  మిగతా విషయాల జోలికి పోరు. ప్రజా జీవితంలో ఆయన ఆలోచనా విధానం  పక్కా జగన్ రెడ్డి లెక్కలతోనే  సాగుతుంది అని అంటుంటారు. మరి ప్రస్తుతం ప్రజల్లో అవినాష్ రెడ్డి పరిస్థితేంటి ?,  వచ్చే ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉండబోతుంది ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి.
 
ఉమ్మడి కడప జిల్లా పులివెందులలో ప్రముఖ రాజకీయ కుటుంబంలో అవినాష్ రెడ్డి జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం అవినాష్ చెన్నై లోని సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మరియు ఇంగ్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ వోర్సెస్టర్ లో ఎంబీఏ పూర్తి చేశారు. అవినాష్ రాజకీయాల్లోకి రాకముందు తమ కుటుంబానికి చెందిన పలు వ్యాపారాలను నిర్వహించేవారు. అవినాష్ కుటుంబ నేపథ్యం లోకి వెళ్తే.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి దగ్గరి బంధువు.  పైగా అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం లో కీలకమైన నాయకుడు కూడా.

అవినాష్ రెడ్డి తన సోదరుడైన వైఎస్ జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకొని రాజకీయాల్లోకి ప్రవేశించి 2014, 2019 లలో వరుసగా రెండుసార్లు కడప ఎంపీగా విజయం సాధించారు. అవినాష్ రెడ్డి పేరుకు ఎంపీగా ఉన్నప్పటికీ,  కడప జిల్లా రాజకీయాల్లో ఆయనే  కీలకమైన పాత్ర పోషిస్తున్నారు.  ముఖ్యంగా జగన్ రెడ్డి నుంచి వచ్చే ఆదేశాలను  అమలు చేయడం కోసం అవినాష్ ఎంత దూరమైనా వెళ్తారని  కడప జిల్లాలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నాటి నుంచి.. నేటి వరకు అనేక వివాదాలు మరియు పలు కీలకమైన కేసుల్లో ఆయన ఇరుక్కోవడం జరిగింది.  
 
ముఖ్యంగా వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అవినాష్ రెడ్డి పేరు ప్రధానంగా ఆరోపించబడుతుంది. ఈ కేసు విషయంలో సీబీఐ కూడా అవినాష్ రెడ్డిని విచారిస్తోంది. ఇంతకీ రాజకీయ నాయకుడిగా  అవినాష్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?,  ప్రజల్లో అవినాష్ రెడ్డి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో అవినాష్ రెడ్డి పరిస్థితేంటి ?, మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ అవినాష్ రెడ్డికి ఉందా ?, ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే..   వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసును బట్టే తేలనుంది. 
 
కడప ప్రజల్లో  వై.ఎస్.వివేకానందరెడ్డికి మంచి పేరు ఉంది. పైగా ఆయన మరణం పై  గొప్ప సానుభూతి ఉంది. కాబట్టి.. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ ప్రమేయం లేదు అని తేలితేనే.. ఈ సారి కడప ప్రజలు అవినాష్ కి ఓట్లు వేస్తారు. లేదు అంటే.. ఓట్లు వేసే పరిస్థితి లేదు.  దీనికితోడు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కూడా  అవినాష్ రెడ్డి పై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే, అవినాష్ గెలుపు అనేది.. వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు పై ఆధారపడి ఉంది. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu