Allu Arjun Revanth Reddy Relation:
తెలంగాణలో అల్లు అర్జున్ అరెస్ట్ చుట్టూ జరుగుతున్న రాజకీయ, సామాజిక చర్చలు ఇప్పుడు కొత్త మలుపు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున హాట్ టాపిక్‌గా మారాయి.
“మనం ఇండియా – పాకిస్తాన్ సరిహద్దులో పోరాడిన వ్యక్తి గురించి మాట్లాడటం లేదు. అతను ఒక సినిమా నటుడు మాత్రమే. అందరు సమానమే, న్యాయాన్ని గౌరవించాలి” అని రేవంత్ రెడ్డి ధైర్యంగా ప్రకటించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తాను వారి పక్షాన ఉంటానని స్పష్టంగా చెప్పారు.
ఇదే సందర్భంలో, రేవంత్ రెడ్డి తనకు అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి కుటుంబంతో సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. స్నేహా రెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్తగా.. హైదరాబాద్‌లోని సైంటు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SIT) ఛైర్మన్‌గా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్‌లో చురుకైన నేతగా ఉన్న చంద్రశేఖర్, తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి, ఇటీవల మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లారు.
అయితే, అల్లు అర్జున్ అరెస్టు విషయాన్ని తప్పించేందుకు చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయలేకపోయారు. ఈ సంఘటనల తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ ఉదయం చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడినప్పటికీ, ఏవైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి దూరంగా ఉన్నారు. మరోవైపు, అల్లు అర్జున్ జైలు నుండి ఇంటికి వచ్చినప్పుడు స్నేహా రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ రాజకీయాలు, సినీ కుటుంబాల ప్రభావం, మరియు న్యాయ వ్యవస్థపై ప్రజల్లో చర్చలు రేకెత్తించింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఈ సంఘటనలో మరింత సీరియస్ టోన్‌ను జోడించాయి.
ALSO READ: 2024 ఈ Tollywood హీరోలకు ఏ మాత్రం కలిసి రాలేదు పాపం!