ఉపేంద్ర సతీమణి ప్రియాంక కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘చిన్నారి’. బేబి యులీనా పార్థవి, ఐశ్వర్య, మధుసూదన్ ప్రధాన పాత్రధారులు. కె.ఆర్.కె. ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. కె. రవికుమార్, ఎం.ఎం.ఆర్ నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడలో ఏకకాలంలో రూపొందించారు. లోహిత్ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ.. ”హారర్ చిత్రమిది. చైల్డ్ సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఉంటుంది. గోవా నేపథ్యంలో కథ జరుగుతుంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. అజినీష్ లోక్‌నాథ్ చక్కటి బాణీలను ఇచ్చారు. కన్నడలో టాప్ కెమెరామెన్ వేణు ఫోటోగ్రఫీ చేశారు. హాలీవుడ్ స్టైల్ టేకింగ్, ఆర్.ఆర్ మెప్పిస్తాయి. 22 ఏళ్ల కుర్రాడు లోహిత్ చాలా బాగా దర్శకత్వం చేశాడు. సెన్సార్‌కు సిద్ధమవుతోంది. నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం” అని చెప్పారు.