HomeOTTKalinga సినిమా ఇప్పుడు ఓటిటిలలో భయపెట్టడానికి రెడీ!

Kalinga సినిమా ఇప్పుడు ఓటిటిలలో భయపెట్టడానికి రెడీ!

Horror Movie Kalinga all set to give goosebumps
Horror Movie Kalinga all set to give goosebumps

Kalinga OTT release date:

ఒక మంచి తెలుగు హారర్ సినిమా చూడటానికి రెడీ అవుతున్నారా? అయితే, అక్టోబర్ 2 తేదీని గుర్తుంచుకోండి. అదే రోజు హారర్ మూవీ Kalinga సినిమా OTTలో విడుదలకాబోతోంది. ఈ సినిమా ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ ఆహా లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

ఆహా బృందం తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేసింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా అక్టోబర్ 2న ఆహా ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమ్ అవ్వబోతోందని వార్తలు వస్తున్నాయి. అభిమానులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే నటుడు ధృవా మాత్రం చిత్ర రిలీజ్‌కు ముందే కలింగ విజయంపై చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. ఈ సినిమా హారర్ నేపథ్యంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని ధృవా అన్నారు. ఈ చిత్రానికి నటుడు-దర్శకుడు ధృవా వాయు దర్శకత్వం వహించారు.

కలింగ కథ ధృవ వాయు నటిస్తున్న లింగ అనే అనాథ యువకుడి చుట్టూ తిరుగుతుంది. లింగ తెలంగాణలోని ఒక చిన్న గ్రామం కలింగకు చెందిన వ్యక్తి. అతను జీవితాన్ని సరదాగా గడుపుతూ మద్యం వ్యసనంతో పోరాడుతూ ఉంటాడు. లింగ పద్దు (ప్రగ్యా నయన్) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. కానీ పద్దు గ్రామ పెద్ద (ఆడుకలం నరేన్) సోదరుడు బాలి (సంజయ్) కారణంగా పద్దు, లింగ మధ్య దూరం వస్తుంది. లింగ జీవితంలో ఉన్న సమస్యలు ఇక్కడి నుంచి మొదలవుతాయి.

లింగ తన కుటుంబ ఋణాలను తీర్చడం, బాలి నుండి పద్దును రక్షించడం, తన గౌరవాన్ని తిరిగి పొందడంతో పాటు ఇంకా ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? అనేది ఈ సినిమా కథ.

నటుడు ధృవా వాయుతో పాటు ఈ చిత్రంలో ప్రగ్యా నయన్, లక్ష్మణ్ మీసాలా, శిజు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీప్తి కొండవీటి, పృథ్వి యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read More: OTT Releases: ఈవారం డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ లో ఎన్ని సినిమాలు సందడి చేయబోతున్నాయో తెలుసా

Recent Articles English

Gallery

Recent Articles Telugu