HomeTelugu Newsహనీట్రాప్ కేసులో కొత్త కోణం

హనీట్రాప్ కేసులో కొత్త కోణం

11
మధ్యప్రదేశ్‌లో సంచలనం రేకెత్తించిన హనీట్రాప్‌ వ్యవహారం వెనుక బెంగళూరుతోనూ సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీ ద్వారా అధికారులు, ప్రముఖ నేతల ఫోన్‌లను ట్యాప్‌ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. బెంగళూరుకు చెందిన సంతోష్‌, సైబర్‌ సేఫ్టీ, సైబర్‌ ఫోరెన్సిక్‌, ఫోన్‌ భద్రతకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను
రూపొందించారు. ఆ సాఫ్ట్‌ వేర్‌ను ఉపయోగించి చాటింగ్‌, ఎస్‌ఎంఎస్‌తోపాటు ఫోన్‌కాల్స్‌ను రికార్డు చేసినట్టు తెలుస్తోంది. సంతోష్‌తో పాటు మరో ఐదుగురు సాప్ట్‌వేర్‌ తయారీలో పనిచేశారు. అందులో శిఖ, సోనూ, అన్సిక, సాక్షితో పాటు సాక్షి సోదరుడు ఉన్నారు. వీరిలో ఇరువురు సైబర్‌ ఫోరెన్సిక్‌లో నిపుణులని తెలుస్తోంది.

హనీట్రాప్‌ వివాదంలో శ్వేతాతో పాటు సంతోష్‌ బృందం భాగస్వాములైనట్టు ఉన్నత వర్గాల ద్వారా తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన కంపెనీ కేంద్ర ఏజెన్సీల కోసం కూడా పనిచేసినట్టు సమాచారం. బ్లాక్‌ మెయిలర్‌, అధికారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయనేతలను హనీట్రాప్‌ చేయడమే కాకుండా వారిని నిరంతరం ఫాలో అయ్యేవారని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu