Honey Rose:
హనీ రోజ్, మలయాళ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్. కాగా ఈ ఇటీవల..తెలుగు సినిమా “వీర సింహారెడ్డి”లో నటించి మంచి గుర్తింపు పొందింది. ఆ సినిమా విజయంతో ఈ హీరోయిన్ కి మంచి పాపులారికినే వచ్చింది. అయినప్పటికీ, ఆమెకు హీరోయిన్గా.. ఈ సినిమా తరువాత.. తెలుగు సినిమాలో అవకాశాలు రాలేదు.
కానీ ఎన్నో ఈవెంట్లలో గెస్ట్‌గా పాల్గొని మంచి ఆదాయాన్ని సంపాదించుకుంటూ ఉంటుంది ఈ హీరోయిన్. అయితే, తాజాగా ఆమె తనకు ఎదురైన లైంగిక వేధింపులపై సోషల్ మీడియా ద్వారా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. ఈ పోస్ట్ లో హనీ రోజ్, ఒక ప్రముఖ బిజినెస్ మాన్ నుండి ఎదురైనా లైంగిక వేధింపులను వివరించింది.
“గత కొంతకాలంగా ఒక బిజినెస్ మాన్ నన్ను మాటలతో వేధిస్తున్నాడు. ఎక్కడపడితే అక్కడ ..నన్ను మాటలతో చాలా వేధిస్తున్నాడు. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నేను ఎందుకు అసలు.. ఇతడి వేధింపులను సహించాలి. నాతో పాటు ఎంతమంది సెలబ్రిటీలు అతడి బిజినెస్ కు సంబంధించిన ఈవెంట్లకు వెళ్తారు. కానీ అతడు మాత్రం నన్ను మాత్రమే.. టార్గెట్ చేస్తున్నాడు. ఒకసారి నేను ఒక ఈవెంట్ కి వెళ్తే మీడియా ముందు నాపై.. చాలా చులకనగా వ్యాఖ్యలు చేశాడు. అవి నన్ను బాధకు గురి చేశాయి. అప్పుడు నేను సైలెంట్ అయ్యాను కానీ.. తర్వాత ఇంటికి వెళ్ళాక ప్రోగ్రామ్ నిర్వాహకులకు ఫోన్ చేసి నాపై చీప్ కామెంట్లు చేస్తే.. నేను సహించను అంటూ వార్నింగ్ ఇచ్చాను. అప్పటినుంచి పూర్తిగా ప్రోగ్రామ్లకు నేను వెళ్లడం మానేశాను,” అంతో చెప్పకువచ్చింది.
“ ఈ మధ్య కూడా.. ఒక ప్రోగ్రాం కి నేను వెళ్లగా. అక్కడికి అతడు కూడా గెస్ట్ గా వచ్చాడు. అక్కడ అందరి ముందు మళ్ళీ నాపై కొన్ని చీప్ కామెంట్స్ చేశారు. తర్వాత అతడి మేనేజర్ బిజినెస్ ప్రమోషన్ లో పాల్గొనమని ఆఫర్ ఇస్తే.. ఒప్పుకోలేదు. ఇకపై ఇలాంటివి చేస్తే సహించకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను,” అంటూ తన పోస్టులో తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ALSO READ: Bigg Boss Telugu OTT రెండవ సీజన్ నిజంగానే త్వరలో మొదలవుతుందా?