కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తాడవం చేస్తుంది, ఈ మహమ్మారికి ధనిక, పేద అనే తేడా లేదు. రాజు, బంటు అనే వ్యత్యాసం లేదు. దేశాధినేతలను సైతం వదలడంలేదు. ఇక, సినీ ప్రముఖులను కూడా వెంటాడుతూనే ఉంది. తాజాగా, ఈ మహమ్మారి బారినపడి మరో సెలబ్రిటీ మృత్యువాతపడ్డారు. ఆయనే హాలీవుడ్ నటుడు అలెన్ గార్ఫీల్డ్. 80 ఏళ్ల అలెన్ గార్ఫీల్డ్‌కు కరోనా వైరస్ సోకింది. న్యూయార్క్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. నిన్న కన్నుమూశాడు. కరోనాతో పోరాటం చేస్తూ ఆయన మృతి చెందినట్టు ఆయన సహచర నటి రోనీ బ్లాక్లే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలెన్ ఆత్మకు శాంతి చేకూరాలి.. నాష్‌విల్లె సినిమాలో తనకు భర్తగా నటించిన వ్యక్తి కరోనాతో మృతిచెందడం తెలిసి బాధకలిగిందని.. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని తన సోషల్ మీడియాలో చేసిన పోస్టులో పేర్కొంది రోని. కాగా, అమెచ్యూర్ బాక్సర్‌గా, స్పోర్ట్స్ రిపోర్టర్‌గా పనిచేసిన అలెన్ గార్ఫీల్డ్.. ఆ తర్వాత సినిమాల్లో నటించారు.. నాష్‌విల్లే, ది స్టంట్వంటి చిత్రాలు ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. ఈయన వినల్ ప్రాత్రల్లోనే ఎక్కువగా నటించారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులతో పాటు… మృతుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది… నిన్న ఒకే రోజు ప్రపంచవ్యాప్తంగా 87,396 కొత్త కేసులు నమోదు కాగా… 5,362 మంది ఒకేరోజు మృతిచెందారు.