టాలీవుడ్ యువ నటుడు సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్ హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘కల్యాణం కమనీయం’. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి అరుణ్ కుమార్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఓహో ఎగిరే’ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
‘కాటుక కన్నే కన్నే .. మీటను నన్నే నన్నే’ అంటూ ఈ పాట మొదలవుతోంది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను కపిల్ కపిలన్ ఆలపించారు. హీరో .. హీరోయిన్స్ పై చిత్రీకరించిన పాట ఇది. విభిన్నమైన ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల కానుంది.