Hitlist OTT:
ఆర్. శరత్‌కుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, విజయ్ కనిష్క నటించిన యాక్షన్ థ్రిల్లర్ “హిట్ లిస్ట్”. కె కర్తికేయన్ మరియు సూర్య కతిర్ కక్కలార్ దర్శకత్వంలో ఈ చిత్రం 2024 మే 31న థియేటర్లలో విడుదలైంది. అయితే ధియేటర్ లలో సినిమాకి ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందింది. ప్రస్తుతం ఈ చిత్రం OTTలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఆహా వేదికపై స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా వారు తమ X పేజీలో పోస్టర్ ను షేర్ చేస్తూ “పక్కా ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ #హిట్‌లిస్ట్ ఇప్పుడు #ahaTamil లో స్ట్రీమింగ్ అవుతోంది” అని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం తమిళ్ వర్షన్ ఆహా లో ఉండగా తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
సినిమా కథ విషయానికి వస్తే, విజయ్ అనే మామూలు మధ్య తరగతి మనిషి చుట్టూ కథ తిరుగుతుంది. విజయ్ తన జీవితాన్ని సాదా సీదాగా జీవించాలనుకుంటాడు, కానీ ఓ అనుమానాస్పద వ్యక్తి తన జీవితంలోకి వస్తాడు. అతడిని అతని కుటుంబాన్ని బెదిరిస్తాడు. విజయ్ తల్లి, కుమార్తెను కిడ్నాప్ చేసి, వారిని చంపుతానని బెదిరిస్తాడు. అప్పుడు విజయ్ ఏమి చేస్తాడు? తన కుటుంబాన్ని తిరిగి తెచ్చేందుకు ఎం చేశాడు? ఆ అనుమానాస్పద వ్యక్తి ఉద్దేశ్యాన్ని తెలుసుకొని తన కుటుంబాన్ని రక్షించగలడా? లేక నేరాల వలలో చిక్కుకుంటాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ సినిమాలో విజయ్ కనిష్క విజయ్ పాత్రలో, ఆర్. శరత్‌కుమార్ ఏసీపీ కే యాజ్వెందన్ ప్రధాన పాత్రలలో కనిపించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, మునిష్కాంత్, సముతిరకని, రెడిన్ కింగ్స్ లే, స్మృతి వెంకట్, రామచంద్ర రాజు కాలి పాత్రలో, రామచంద్రన్ దురై రాజ్, పోస్టర్ నందకుమార్ మరియు పాండియన్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఆర్ కె సెల్యూలాయిడ్స్ సంస్థ పతాకంపై కేఎస్ రవికుమార్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాకి సీ సత్య సంగీతాన్ని సమకూర్చారు.