
HIT 3 Pre-Release Deal Details:
నాని సినిమాలంటే ఓ ప్రత్యేకమైన హైప్ ఉంటుంది. ఇటీవల వచ్చిన ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబోడీ’ సినిమాకు నాని చేసిన ప్రమోషన్ పద్దతులు సినిమాకు బాక్సాఫీస్ వద్ద బలమైన బూస్ట్ ఇచ్చాయి. ఇప్పుడు అలాంటి హైప్‌ను మరోసారి తన కొత్త సినిమా HIT 3 కోసం క్రియేట్ చేస్తున్నాడు న్యాచురల్ స్టార్.
ఇది HIT యూనివర్స్‌లో మూడో సినిమా. ఈసారి కేవలం హీరోగానే కాకుండా, ప్రొడ్యూసర్‌గానూ నాని వ్యవహరిస్తుండటం విశేషం. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, “రామా రామా” పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నానికి గత ఏడాది నుంచి హిట్ల పరంపర కొనసాగుతుండటంతో, HIT 3 మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.40 కోట్ల వరకు లాక్ అయినట్టు తెలుస్తోంది. ఇది ఒక మిడ్రేంజ్ సినిమా కోసం చాలా మంచి ఫిగర్. ముఖ్యంగా నాని హిట్ ఫామ్‌లో ఉన్న సమయంలో, ట్రేడ్ సర్కిల్స్ ఈ నెంబర్‌ను చాలా పాజిటివ్‌గా చూస్తున్నాయి.
ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంటే, ఈ బిజినెస్ మొత్తం రికవరీ కావడం చాలా ఈజీ అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. అంతేకాదు, మొదటి రోజు నుంచే గ్రాండ్ ఓపెనింగ్ దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇప్పుడు మొత్తం ఫోకస్ సినిమాపై వస్తున్న టాక్ మీదే. HIT 3, థ్రిల్లర్ జానర్‌తో వస్తుండటంతో, మాస్ ప్రేక్షకులు కాకుండా, యూబన్ ఆడియన్స్ టార్గెట్ చేస్తోంది. మరి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.