HomeTelugu Trendingవిదేశీయుడు తెలుగుపై మంచులక్ష్మీ ప్రశంసలు

విదేశీయుడు తెలుగుపై మంచులక్ష్మీ ప్రశంసలు

1 13అమెరికాకు చెందిన ఐసాక్‌ రిచర్డ్‌ చకచకా తెలుగు మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇటీవల ఆయనకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అయ్యింది. అందులో ఐసాక్‌ తెలుగు భాష అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఆ వీడియోకు ఎక్కువ వ్యూస్‌ లభించాయి. ఈ విషయం తెలుసుకున్న ఐసాక్‌ తాజాగా స్పందించారు. తను అమెరికాకు చెందిన వ్యక్తినని, రెండేళ్లు భారత్‌లో ఉన్నానని అన్నారు. ‘ఓ ఏడాది వైజాగ్‌లో, మరో ఏడాది విజయవాడలో ఉన్నాను. అక్కడే తెలుగు నేర్చుకున్నాను. నేను తెలుగు మాట్లాడటం గొప్ప విషయమా?. నా వీడియో ఎందుకు తీస్తున్నారని మొదట అనుకున్నాను. కానీ దానికి మంచి స్పందన వచ్చింది. ఫేస్‌బుక్‌ ద్వారా త్వరలో నేనే మీతో మాట్లాడుతా.. ‘ అని ఐసాక్‌ చెబుతున్న వీడియోను దినేష్‌ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

దీన్ని చూసిన నటి మంచు లక్ష్మి ట్విటర్‌లో స్పందించారు. ‘అతడు నాకంటే బాగా తెలుగు మాట్లాడుతున్నాడు (నవ్వుతున్న ఎమోజీ). మన భాషను విదేశీయులు ఇష్టపడటం చాలా సంతోషంగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు. ‘నీ దుంపతెగ.. ఎంత బాగా మాట్లాడుతున్నావ్‌..’ అంటూ నటుడు బ్రహ్మాజీ కూడా ఈ వీడియోకు కామెంట్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu