దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన త్రిష ఇప్పటికీ తమిళంలో బిజీ స్టార్ గా తన హవాను
కొనసాగిస్తోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూనే. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా
మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా కోసం అమ్మడు సిద్ధపడుతోందని సమాచారం. గత ఏడాది
హిందీలో అనుష్క శర్మ ప్రధాన పాత్రలో ‘ఎన్.హెచ్.10’ సినిమా వచ్చింది. ఈ చిత్రాన్ని అనుష్క
శర్మనే స్వయంగా నిర్మించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి నిర్మాతలు
సిద్ధపడుతున్నారు. ఈ మేరకు ఇందులో హీరోయిన్ గా త్రిషను సంప్రదించగా ఆమె సానుకూలంగా
స్పందించినట్లు తెలుస్తోంది. ఆమె డేట్స్ ను కేటాయించిన వెంటనే సినిమాను సెట్స్ పైకి
తీసుకువెళ్ళే ప్లాన్ లో ఉన్నారు. అయితే ఈ సినిమాను డైరెక్ట్ చేసేది ఎవరనే విషయాలు
తెలియాల్సివుంది!