
Highest Paid Actors in India 2025:
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ గురించి వినగానే మనకు గుర్తొచ్చే మాట – “వర్క్ వర్క్ వర్క్!” ఏం సినిమా ఉన్నా, ఏ టైం అయినా.. అక్షయ్ ఎప్పుడూ బిజీగా కనిపిస్తుంటాడు. ఇప్పుడతను కొత్తగా వస్తున్న “కేసరి చాప్టర్ 2” సినిమాతో తన బాక్సాఫీస్ ఫామ్‌కి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో అతడితో పాటు ఆర్. మాధవన్, అనన్య పాండే కూడా ఉన్నారు.
ఈ సినిమా కోసం అక్షయ్ తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా హాట్ టాపిక్‌గానే మారింది. గతంలో వచ్చిన “స్కై ఫోర్స్” సినిమాకైతే అక్షయ్ ప్రాప్స్‌గా రూ.70 కోట్లకు పైగా తీసుకున్నాడట! అది ఆ సినిమా మొత్తం బడ్జెట్‌లో సగం అంటే ఊహించండి ఎంత క్రేజ్ ఉందో! అక్షయ్ ఒక సినిమాకు రూ.60 కోట్ల నుంచి రూ.145 కోట్ల వరకు తీసుకుంటాడట. “కేసరి 2″కీ కూడా ఇదే రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు టాక్.
అయితే అభిమానుల్లో ఇప్పుడు డౌట్ – “అక్షయ్ ఇంకా టాప్ 5 లో ఉన్నాడా?” అనేది. నిజానికి 2025లో అక్షయ్ 10వ స్థానంలో ఉన్నాడు. ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన లిస్ట్ ప్రకారం:
1. అల్లు అర్జున్ – రూ.300 కోట్లు
2. జోసెఫ్ విజయ్ – రూ.130–275 కోట్లు
3. షారుక్ ఖాన్ – రూ.150–250 కోట్లు
4. రజినీకాంత్ – రూ.125–270 కోట్లు
5. ఆమిర్ ఖాన్ – రూ.100–275 కోట్లు
6. ప్రభాస్
7. అజిత్
8. సల్మాన్ ఖాన్
9. కమల్ హాసన్
10. అక్షయ్ కుమార్
ఇప్పుడు టాప్ 5లో లేకపోయినా, అక్షయ్ రెగ్యులర్‌గా సినిమాలు చేస్తూ, బ్రాండ్ వెల్యూ కాపాడుకుంటూ ముందుకెళ్తున్నాడు. “కేసరి చాప్టర్ 2” హిట్ అయితే, మళ్లీ టాప్ 5లోకి ఎంటర్ అవ్వడమూ ఖాయం. మరి ఆ రోజు వస్తుందా? చూడాలి మరి!













