HomeTelugu TrendingArjun S/o Vyjayanthi రైట్స్ తో రికార్డు బద్దలు కొట్టేసిన కళ్యాణ్ రామ్

Arjun S/o Vyjayanthi రైట్స్ తో రికార్డు బద్దలు కొట్టేసిన కళ్యాణ్ రామ్

Highest OTT and theatrical deal for Kalyan Ram with Arjun S/o Vyjayanthi
Highest OTT and theatrical deal for Kalyan Ram with Arjun S/o Vyjayanthi

Arjun S/o Vyjayanthi business:

నందమూరి కళ్యాణ్ రామ్ తన కొత్త సినిమా ‘అర్జున్ S/o వైజయంతి’ తో మళ్లీ అదరగొట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యిన దగ్గర నుంచి భారీ హైప్ క్రియేట్ అవుతోంది. క్లాస్, మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేసిన ఈ సినిమా, ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేపింది.

విజయశాంతి కీలకపాత్రలో నటిస్తుండటంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. టీజర్ కు వచ్చిన సూపర్ రెస్పాన్స్ కారణంగా ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బిజినెస్ చేసుకుంది. OTT & Satellite రైట్స్ ఏకంగా రికార్డ్ స్థాయిలో అమ్ముడవ్వగా, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ ₹12 కోట్లు, సీడెడ్ రైట్స్ ₹3.70 కోట్లు కు సాలిడ్ డీల్ కుదిరింది.

ఈ సినిమాకి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తుండగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సోహైల్ ఖాన్, శ్రీకాంత్, బబ్లూ పృథ్విరాజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని అజనీష్ లోకనాథ్ అందించగా, NTR ఆర్ట్స్ & అశోక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇప్పటికే టీజర్ తో మంచి బజ్ వచ్చిన ఈ సినిమాకు ట్రైలర్ & ప్రమోషన్స్ మరింత బలాన్ని చేకూర్చనుండటంతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ రావడం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu