HomeTelugu Trending2024 లో ఎక్కువ టిక్కెట్లు ఈ సినిమాకి అమ్ముడయ్యాయి!

2024 లో ఎక్కువ టిక్కెట్లు ఈ సినిమాకి అమ్ముడయ్యాయి!

Highest number of tickets got sold for this movie in 2024!
Highest number of tickets got sold for this movie in 2024!

2024 movie that recorded highest number of tickets sold:

2024 సంవత్సరం బ్లాక్‌బస్టర్ సినిమాలతో కళకళలాడింది. ఫైటర్, స్ట్రీ 2, సింఘమ్ అగైన్, భూల్ భులయ్యా 3 లాంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. కానీ అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన పుష్ప 2: ది రూల్ మాత్రం ఏడాదికి స్పెషల్ హైలైట్‌గా నిలిచింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం BookMyShow విడుదల చేసిన #BookMyShowThrowback నివేదిక ప్రకారం 10.8 లక్షల మంది సోలో వ్యూయర్స్‌తో 2024లో అత్యధికంగా వీక్షించిన సినిమా అయ్యింది.

2021లో విడుదలైన పుష్ప: ది రైజ్ కి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 1,500 కోట్లను దాటి ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, అందరూ కనెక్ట్ అయ్యే కథ, పవర్‌ఫుల్ ఎమోషన్లతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే, సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఆన్‌లైన్‌లో HD ఫార్మాట్‌లో లీక్ కావడం కలకలం రేపింది.

నవంబర్ 1, 2024 సినిమా టికెట్‌ల అమ్మకాలలో అత్యంత పిక్స్‌ను సాధించిన రోజు. కేవలం 24 గంటల్లో 2.3 మిలియన్ టికెట్లు అమ్ముడవ్వడం విశేషం. అలాగే, పాత హిట్లు కల్ హో నా హో, రాక్‌స్టార్, లైలా మజ్ను రీ-రిలీజ్‌లు కూడా ప్రేక్షకులను బాగానే థియేటర్లకు రప్పించాయి.

2024లో బుక్ మై షో 30,000కి పైగా లైవ్ ఈవెంట్లను నిర్వహించింది. కోల్డ్‌ప్లే, నిక్ జోనాస్, మారూన్ 5 వంటి ప్రముఖ బృందాలు ప్రదర్శనలు ఇచ్చాయి. ముఖ్యంగా కోల్డ్‌ప్లే అహ్మదాబాద్ కాన్సర్ట్ అభిమానులను 500కి పైగా నగరాల నుంచి ఆకర్షించింది.

సోలో ఎంటర్టైన్మెంట్ విభాగంలో కూడా 8.87 లక్షల మంది వ్యక్తిగతంగా సినిమాలు, లైవ్ షోలకు హాజరయ్యారు. BookMyShow Streamలో 1 లక్ష గంటల కంటెంట్ చూసారు.

ALSO READ: హైదరాబాద్ రెస్టారెంట్స్ రైడ్ లో బయటకి వచ్చిన Top Gachibowli Restaurants పేర్లు!

Recent Articles English

Gallery

Recent Articles Telugu