HomeTelugu Big StoriesHighest Budget Movies 2024: పాన్‌ ఇండియా సినిమాలతో దుమ్మురేపనున్న తెలుగు హీరోలు

Highest Budget Movies 2024: పాన్‌ ఇండియా సినిమాలతో దుమ్మురేపనున్న తెలుగు హీరోలు

Highest Budget Movies 2024

Highest Budget Movies 2024: దర్శక ధీరుడు రాజమౌళి పుణ్యామా అని తెలుగు పరిశ్రమ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. తెలుగు హీరోలు ప్రపంచ వ్యాప్తంగా తమ సత్తా చాటుతున్నారు. పాన్‌ ఇండియా సినిమాలతో తమ క్రేజ్‌ని పెంచుకుంటున్నారు. గ్లోబల్ స్టార్లుగా ఎదుగుతున్నారు. ప్రస్తుతం చిన్న, పెద్ద హీరోలు అందరూ కూడా పాన్‌ ఇండియా సినిమాలవైపే అడుగులు వేస్తున్నారు.

తాజాగా తెరపై ఉన్న ఐదు పాన్‌ ఇండియా సినిమాలు ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. ఇందులో నటించే హీరోలే కాదు.. వీటి బడ్జెట్లు కూడా కళ్లు చెదిరేలా ఉన్నాయి. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మంచు విష్ణులాంటి స్టార్ హీరోలు ఈ ఐదు సినిమాలతో మరో రేంజ్ కు వెళ్లనున్నారు.

టాలీవుడ్ నుంచి త్వరలో పలు భారీ బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయి. ఇందులో ఆరు మాత్రం ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. వాటిలో కల్కి 2898 ఏడీ, గేమ్ ఛేంజర్, దేవర, పుష్ప 2, కన్నప్ప, ఎస్ఎస్ఎంబీ29.. సినిమాలు ఉన్నాయి.

mahesh babu 2 Highest Budget Movies 2024,Game Changer,Pushpa-2,Devara,Kannappa,Kalki

ఎస్ఎస్ఎంబీ29
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ29’. ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా దీని తెరకెక్కిస్తున్నారు. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తీయనున్నట్లు తెలుస్తుంది.

ఈ మూవీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. పాన్ ఇండియా కాదు గ్లోబల్ లెవల్లో ఈ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు నడుస్తుండగా.. సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Highest Budget Movies 2 Highest Budget Movies 2024,Game Changer,Pushpa-2,Devara,Kannappa,Kalki

కల్కి 2898 ఏడీ
ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల్లో మూవీ ‘కల్కి 2898 ఏడీ’. పాన్‌ ఇండియా హీరో ప్రభాస్, దీపికా హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుచెందిన వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్, కమల్ హాసన్ లాంటి ప్రముఖ స్టార్‌లు నటిస్తున్న ఈ మూవీని రూ.600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మే 9న రిలీజ్ అవుతుందని గతంలో మేకర్స్ అనౌన్స్ చేసినా.. ఇప్పుడా తేదీ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మే 30న రావచ్చని అంచనా వేస్తున్నారు.

కాగా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన అమితాబ్‌ గ్లింప్స్‌కి దర్శకుడిపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

pushpa 4 Highest Budget Movies 2024,Game Changer,Pushpa-2,Devara,Kannappa,Kalki

పుష్ప 2
‘పుష్ప’ మూవీ సూపర్ హిట్ అయిన తర్వాత ఈ సీక్వెల్ పై ఉన్న అంచనాల నేపథ్యంలో భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందిస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సీక్వెల్ ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. ఈ మధ్యే టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో అల్లు అర్జున్‌ యాక్షన్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. ఈ టీజర్‌తో పుష్ప-2 అంచనాలు మరింతగా పెరిగిపోయ్యాయి. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా తెలుగులో 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది.

గేమ్ ఛేంజర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. ప్రముఖ కోలీవుడ్‌ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. అతని గత సినిమాలలాగే ఇది కూడా .. ఏకంగా రూ.400 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత రామ్‌చరణ్‌ నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాల ఉన్నాయి.

Highest Budget Movies 1 1 Highest Budget Movies 2024,Game Changer,Pushpa-2,Devara,Kannappa,Kalki

 

దేవర
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ ఈ సినిమాతో మరోసారి రిపీట్ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా దేవరను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. బెంగాలీ నటి కూడా ఈ సినిమాలో భాగం కానున్నట్లు తెలుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

కన్నప్ప
మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మక నిర్మిస్తున్న చిత్రం కన్నప్ప. మంచు విష్ణు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, శివ రాజ్ కుమార్ లాంటి పెద్ద పెద్ద స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీని రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభించారు. మంచు విష్ణు కెరీయర్‌లో వస్తున్న అత్యంత భారీ బడ్జెట్ మూవీ ఇది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu