బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు ముంబై హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనధికారికంగా భవనాలు నిర్మించారనే ఆరోపణతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఇచ్చిన నోటీసులపై సోనూసూద్ వేసిన పిటిషన్‌ను బాంబే కోర్టు కొట్టి వేసింది. ‘‘నిజాయతీ గల వారి వైపు న్యాయం ఉంటుంది. ఇప్పుడు బంతి బీఎంసీ చేతిలోకి వెళ్లింది. వారిని సంప్రదించండి’’ అని జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. మీకున్న అవకాశాన్ని కోల్పోయారు.. మీరు చాలా ఆలస్యమయ్యారు అని తెలిపారు.
ముంబై జుహూ ప్రాంతంలోని ఓ భవనం విషయంలో సోనూ సూద్, బీఎంసీ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర రీజియన్ అండ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందున ఆయనకు గత ఏడాది నోటీసులు జారీచేసింది. పలుమార్లు నోటీసులు పంపినా ఆయన స్పదించడం లేదని.. ఇటీవలే పోలీస్ కేసు పెట్టింది. తన అంతస్తుల భవాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా హోటల్‌గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను ఉల్లంఘించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. ఐతే బీఎంసీ ఆరోపణలను సోను సూద్ తీవ్రంగా ఖండించారు. నివాస భవనాన్ని హోటల్‌గా మార్చేందుకు బీఎంసీ నుంచి ‘చేంజ్ ఆఫ్ యూజర్’ అనుమతులు తీసుకున్నానని స్పష్టం చేశారు.
కోర్టు విచారణ సందర్భంగా.. ఇటీవల సోనూసూద్‌పై ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సోనూసూద్ అలవాటు పడ్డ నేరస్తుడని వెల్లడించింది. జుహూ ప్రాంతంలో సోనూ అనధికారికంగా భవనాలు నిర్మించారని.. వాటిని గతంలో తాము రెండుసార్లు కూల్చివేశామని, అయినా పద్దతిని మార్చుకోలేదని అఫిడవిట్‌లో వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టులోనూ ఊరట దక్కకపోవడంతో సోనూ సూద్ తరువాత ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.