HomeTelugu News'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' హైకోర్టు తీర్పు!

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ హైకోర్టు తీర్పు!

5 18

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’, ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ సినిమాల విడుదల నిలుపుదలను హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల కారణంగా ఈ రెండు సినిమాల విడుదల నిలిపివేయాలని కోరుతూ సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో భోజన విరామ పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో విడుదల చేస్తే ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. సత్యనారాయణ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. రెండు సినిమాల విడుదలలో జోక్యం చేసుకోలేమని చెప్పింది.
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతి జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని తీసినట్లు ఆయన తెలిపారు. ఇందులో ఎన్టీఆర్‌ పాత్రను పశ్చిమ గోదావరికి చెందిన రంగస్థల నటుడు పోషించారు. లక్ష్మీ పార్వతిగా కన్నడ నటి యజ్ఞ శెట్టి నటించారు. కీరవాణి సోదరుడు కల్యాణి‌ మాలిక్‌ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. మార్చి 29న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు వర్మ మంగళవారం ఉదయం ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu