మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరటనిచ్చింది. 2014 ఎన్నికల సమయంలో గుంటూరులో చిరంజీవిపై నమోదైన కేసును కొట్టివేసింది. అప్పటి ఎన్నికల సమయంలో నిర్ణీత సమయంలో మీటింగ్ పూర్తి చేయలేకపోయారని, దాంతో ట్రాఫిక్ సమస్యలు వచ్చాయని.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అప్పట్లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిరంజీవిపై కేసు నమోదైంది.
తొమ్మిదేళ్ల నాటి ఈకేసుని కొట్టివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం చిరంజీవిపై నమోదైన కేసును కొట్టివేస్తూ ఆదేశాలిచ్చింది.