న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. నాని 30గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్, పాటలు ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చింది.
తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదలైంది. లవ్, ఎమోషనల్ అంశాలుతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నాని స్క్రీన్ ప్రేజెన్స్, నటన, డైలాగ్స్ ట్రైలర్ లో బాగున్నాయి. హీరోయిన్ మృణాల్ విజువల్స్, యాక్టింగ్ బాగుంది.
మొత్తంగా ట్రైలర్ ని బట్టి చూస్తుంటే, హాయ్ నాన్న మూవీ మనసుని తాకే ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా సాగుతుందని అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ వైరల్ అవుతుంది. హాయ్ నాన్నలో బేబీ కియారా, శృతిహాసన్ కీలక పాత్రల్లో కనిపించనుంది. ఈమూవీని డిసెంబర్ 7న పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.