టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. నాని 30 సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో మృణాళ్ థాకూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. మలయాళ నటుడు జయరాం కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా డిసెంబరు 7న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేశారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి నాని డిఫరెంట్‌గా ప్రమోషన్స్ మొదలుపెట్టగా.. ఈ ప్రమోషన్స్‌కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో ప్రీ రిలీజ్ వేడుకను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. దానికోసం వైజాగ్‌లోని ఆర్ కే బీచ్ వద్ద ఉన్న గోకుల్ పార్కును ఎంచుకున్నారు.
నవంబర్ 29 తేదిన సాయంత్రం 6 గంటల నుంచి ఈ ప్రీ రిలీజ్ వేడుక జరుగనుంది. ఇక తండ్రీకుమార్తెల సెంటిమెంట్‌తో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. హాయ్ నాన్నలో బేబీ కియారా, శృతిహాసన్ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. డిసెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.