నేచులర్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. డిసెంబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టే మంచి కలెక్షన్లను దక్కించుకుంది. తండ్రీ, కూతుళ్ల సెంటిమెంట్, లవ్ స్టోరీతో కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన హాయ్ నాన్న ఆకట్టుకుంది. ఇప్పుడు, ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయింది. హాయ్ నాన్న స్ట్రీమింగ్ డేట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది.
హాయ్ నాన్న సినిమా జనవరి 4వ తేదీన (2024) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని నెట్‍ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ‘మీతో ఎప్పుడూ ఉండిపోవడానికి వచ్చేశారు యష్న (మృణాల్ ఠాకూర్), మహీ (కియారా ఖన్నా), విరాజ్ (నాని). హాయ్ నాన్న మూవీ నెట్‍ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో జనవరి 4 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది’ అని నెట్‍ఫ్లిక్స్ ట్వీట్ చేసింది.
ఈ సినిమాలో నానికి జంటగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‍గా నటించారు. నాని కూతురు పాత్రను బేబి కియారా ఖన్నా పోషించారు. ఈ చిత్రంలో నాని, మృణాల్, కియారా నటనకు చాలా ప్రశంసలు వచ్చాయి. వీరి పర్ఫార్మెన్స్ మూవీకి హైలైట్‍గా నిలిచింది. ఈ చిత్రాన్ని శౌర్యువ్ దర్శకత్వం వహించాడు.