అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాలో అదితీ రావు, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగు పూర్తిచేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ‘హే రంభ’ అంటూ సాగే లిరికల్ వీడియె విడుదలైంది. ఈ పాట మాస్ ఆడియాన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా.. భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించాడు. జగపతిబాబుతో చాలా రోజుల తరువాత ఈ పాటలో స్టెప్పులు వేశారు.